JL NOTIFICATION
Employees Welfare Fund
ఉద్యోగుల ఆర్థికావసరాలకు సంక్షేమ నిధి (Employees Welfare Fund)
👉 ప్రభుత్వ కొలువుల్లో సేవలందిస్తున్న వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులకు ఆర్ధిక అవసరాల నిమిత్తం సహాయం, రుణాలు అందించేందుకు 1980 లో రాష్ట్ర ప్రభుత్వం *ఉద్యోగుల సంక్షేమ నిధి (EWF)* ఏర్పాటుచేసింది. ఈ నిధికి అవసరమైన సొమ్మును సభ్యుల చందా, ప్రభుత్వ గ్రాంట్, ప్రజా విరాళాల రూపంలో సమకూర్చుతారు. ఈ మొత్తం నిధికి లభించే వడ్డీ నుంచి ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్ధిక సహకారం/కొద్ది మొత్తంలో రుణాలు అందిస్తారు.
👉 *ప్రభుత్వ ఉద్యోగులే సభ్యులు:*
ప్రభుత్వ/స్థానిక/ఎయిడెడ్ సంస్థల్లో నియమితులైన ఉద్యోగులు ఈ పథకంలో సభ్యులు. అత్యవసర ఉద్యోగులు మినహా తాత్కాలిక, రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులందరూ తప్పనిసరిగా సభ్యులుగా ఉంటారు.
👉 *సభ్యత్వం ఇలా:*
మొదట ఉద్యోగి వార్షిక చందా రూ.5 గా ఉండేది. 1992 తర్వాత రూ.10 గా ఉండేది. 2006 మార్చి నుండి వార్షిక చందా మొత్తం రూ.20 కి పెరిగింది. అయితే ఉద్యోగి సభ్యత్వం తీసుకునేప్పుడు రూ.50 చెల్లించాలి. తర్వాత నుంచి వార్షిక చందా 20 చెల్లించాలి. ఈ ప్రారంభ చెందా,వార్షిక చెందా మొత్తం రూ.70 ఉద్యోగి మొదటి నెల జీతం నుండి మినహాయిస్తారు. వార్షిక చందా రూ.20 ప్రతి సంవత్సరం ఉద్యోగి మార్చి జీతం నుండి మినహాయిస్తారు.
👉 *సంక్షేమ నిధి నిర్వాహణ కమిటీ:*
ఈ నిధిని నిర్వహించేందుకు రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రెటరీ ఛైర్మెన్ గా, ఆర్ధికశాఖ జాయింట్ సెక్రెటరీ మెంబర్ కార్యదర్శి-కం-ట్రెజరర్ గా ఒక కమిటీ ఉంటుంది. అలాగే జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా,జిల్లా ట్రెజరీ అధికారి మెంబర్ కార్యదర్శి-కం-ట్రెజరర్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఆయా కమిటీల్లో ప్రభుత్వ గుర్తింపు గల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల రాష్ట్ర,జిల్లాస్థాయి కమిటీల బాధ్యులు సభ్యులుగా ఉంటారు.
👉 *అప్పులు మంజూరు ఇలా... G.O.Ms.No.131,EWF Dt: 14.5.2012*
ఉద్యోగులు/వారి పిల్లల వివాహాలకు, పిల్లలకు చదువులు/వైద్య ఖర్చులు నిమిత్తం సభ్యులకు ఈ ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి అప్పులు మంజూరు చేస్తారు. జిల్లా కమిటీ ద్వారా రూ.20 వేల వరకు అప్పును పొందవచ్చు. సాధారణ వడ్డీతో కలిపి తీసుకున్న రుణాన్ని 5 సంవత్సరాలలో చెల్లించాలి. వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు, పిల్లల విదేశీ చదువులకు రూ.25 వేల వరకు ఈ నిధి నుంచి అప్పు మంజూరు చేస్తారు.
👉 ఈ అప్పులను DD ల రూపంలో చెల్లిస్తారు. నిర్ణయించబడిన సమాన వాయిదాలలో ప్రతి నెలా జీతపు బిల్లులో రికవరీ చేయాలి. *G.O.Ms.No.404,F&P Dt: 30.7.2001*
👉 *ఆర్ధిక సహాయం ఇలా...*
వైద్య ఖర్చులు/పిల్లల చదువులు/ఆచార సంబంధమైన కార్యాలకు రూ.1000 వరకు ఉచిత సహాయం అందిస్తారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి రూ.10,000 లకు మించకుండా ఈ నిధి నుంచి రుణం మంజూరు చేస్తారు. రెగ్యులర్ ఉద్యోగులకు రియంబర్స్మెంట్/ఉపాధ్యాయ ఆరోగ్య పథకంలో అర్హత ఉంటుంది. శస్త్ర చికిత్స అనంతరం రియంబర్స్మెంట్ కంటే ఎక్కువ ఖర్చు అయితే ఆ ఉద్యోగికి 10,000 మించకుండా అప్పు మంజూరు చేస్తారు. గృహనిర్మాణం/కొనుగోలు/మరమ్మత్తుల నిమిత్తం ఈ నిధి నుంచి అప్పు గాని,సహాయం గాని లభించదు.
*దరఖాస్తు ఇలా...*
ఈ నిధి నుంచి రుణం కోసం/ ఆర్ధిక సహాయానికి దరఖాస్తులు నిర్ణీత ఫారం లో రాష్ట్ర కమిటీ మెంబర్,సెక్రటరీ కం ట్రెజరర్ ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి కి సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు పంపించాలి. దరఖాస్తు ఫారాలు జిల్లా ఖజానా కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి.
SCHOOL GRANTS UTILISATION PROCEDURE THROUGH PFMS WEBSITE
SCHOOL GRANTS UTILISATION PROCEDURE THROUGH PFMS WEBSITE
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 50% MRC, స్కూల్ కాంప్లెక్స్ మరియు స్కూల్ గ్రాంట్స్ నిధులు విడుదల అయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే సుమారుగా 8 నెలలు (ఏప్రిల్ నుండి నవంబర్ వరకు) గడిచిపోయాయి కాబట్టి ఈ ఎనిమిది నెలల కాలంలో ఖర్చు చేసిన మొత్తాలను వెంటనే విడుదల చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
ప్రధానోపాధ్యాయులు, MEO లు అందర్నీ నిబంధనల ప్రకారం సరి అయిన తీర్మానాలు చేసి PPA ప్రింట్, పేమెంట్, అడ్వైస్ ద్వారా అయిన ఖర్చుల చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా సూచించనైనది.
1. సాధ్యమైనంత వరకు ఏ నెలలో చేసిన కొనుగోలు/ఖర్చులు/చెల్లింపులకు సంబంధించి ఆ నెలలోనే ఒక తీర్మానం వ్రాసుకుని, ఆ అవసరాలకు సరిపోయి మొత్తాన్ని ఎవరైతే అందించారో వారి వద్ద నుండి లోన్ తీసుకున్నట్టుగా పొందుపరచాలి.
2. అందుకు అనుగుణంగా క్యాష్ బుక్ లో కూడా ఎంత మొత్తం ఎవరి వద్ద నుండి లోన్ గా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని నమోదు చేయాలి.
3. స్టేషనరీ తదితర సామాగ్రి కొనుగోలులకు సంబంధించిన వివరాలను స్టాక్ రిజిస్టర్లలో కూడా ఎంటర్ చేయాలి.
4. పైన సూచించిన విధంగా నెలల వారీగా ఈ నెల వరకు జరిపిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ని తీర్మానాల రిజిస్టర్, క్యాష్ బుక్ మరియు స్టాక్ బుక్ లలో నమోదు చేయాలి.
5. చివరగా గత నెలలలో చేసిన తీర్మానాలను రిఫరెన్స్ గా పేర్కొంటూ ఇప్పటివరకు చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో లెక్కిస్తూ ఆ మొత్తాన్ని ప్రస్తుతం విడుదలైన నిధుల నుండి చెల్లిస్తున్నట్లుగా తీర్మానం చేయాలి.
6. ఒకవేళ అయిన ఖర్చులు విడుదలైన నిధుల మొత్తం కంటే ఎక్కువ ఉన్నట్లయితే భవిష్యత్తులో విడుదల అయ్యే నిధులనుండి మిగిలిన మొత్తాన్ని చెల్లించబోతున్నట్లుగా తీర్మానం చేసుకోవాలి.
7. PFMS సైట్ లో వివరాలు ఎంటర్ చేసి ఆపరేటర్ మరియు అప్రూవర్ విధానంలో ప్రాసెస్ పూర్తి చేసి (PPA ప్రింట్, పేమెంట్, అడ్వైస్) ఓచర్ పై SMC చైర్ పర్సన్ మరియు ప్రధానోపాధ్యాయుల సంతకంతో (MRC, CRC గ్రాంట్స్ విషయంలో సంబంధిత అకౌంట్ హోల్డర్స్ సంతకాలతో) తీసుకువెళ్లి బ్యాంకులో అందించాలి.
ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధానంలో క్యాష్ విత్ డ్రాయల్ కి అవకాశం లేదు. ఓచర్ ద్వారా నగదును ఎవరికైతే చెల్లించదల్చుకున్నామో వారి అకౌంట్ కి బదిలీ చేయవలసి ఉంటుంది.
8. మరొక ముఖ్యమైన గమనిక ఈ అకౌంట్ లో ఏ ఇతర నిధులను కూడా జమ చేయకూడదు. వివిధ సందర్భాలలో ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే నిధులు అయినా కూడా ఈ అకౌంట్లో జమ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా జమ చేసినా అవి మన అకౌంట్లో నిలువ ఉండవు. ఆ నిధులు SNA అకౌంట్ కు వెళ్ళిపోతాయి.
9. నిధుల విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది కాబట్టి వెంటనే వాటిని నిబంధనల ప్రకారం ఖర్చు చేయవలసిందిగా కోరనైనది.
HOW TO CREATE DATA OPERATOR
Step No. 1 : Login as Agency Administrator at “https://pfms.nic.in”
Step No. 2 : Go to “Masters”
Step No. 3 : Go to “Users”
Step No. 4 : Click on “Add New”
Step No. 5 : Select the Type of User as “Agency Data Operator” and fill the other fields.
Step No. 6 : Click on “Submit”.
Note : The Username and Password will be sent at the e-mail id provided at the time of registration.
SMC level Data Operator (Maker) : Head Master
CRC level Data Operator (Maker) : Secretary
MRC level Data Operator (Maker) : MIS Coordinator
KGBV/URS level Data Operator (Maker) : Accountant
GIRLS HOSTEL level Data Operator (Maker) : Care Taker
HOW TO CREATE DATA APPROVER
Step No. 1 : Login as Agency Administrator at “https://pfms.nic.in”
Step No. 2 : Go to “Masters”
Step No. 3 : Go to “Users”
Step No. 4 : Click on “Add New”
Step No. 5 : Select the Type of User as “Agency Data Approver”
Step No. 6 : Select the Level of Approver as “Level_1” and fill the other fields.
Step No. 7 : Click on “Submit”.
Note :
The Username and Password will be sent at the e-mail id provided at
the time of registration.
SMC level Data Approver (checker) : SMC Chairman
CRC level Data Approver (checker) : Complex HM
MRC level Data Approver (checker) : MEO
KGBV/URS level Data Approver (checker) : Special officer
GIRLS HOSTEL level Data Approver (checker) : Special officer
SNA సమగ్ర సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇👇
SNA (SINGLE NODAL AGENCY )సమగ్ర సమాచారం
PFMS Site లో Headmaster మరియు SMC CHAIRMAN లాగిన్ అయే విధానం తెలుసు కొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇👇👇
( Shop / Worker ) దుకాణ దారు, పని వారిని, బుక్ షాప్ వారిని, PFMS వెబ్ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసే వివరాలు తెలుసు కొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి .
👇👇👇
VENDOR REGISTRATION AND MANAGEMENT
దుఃఖనదారుని కి చెల్లింపు చేసే విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇
PFMS complete use manual కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇
FORMS AND REGISTERS కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇
PFMS SITE లోకి లాగిన్ అవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇
1.PFMS website లో అకౌంట్ క్రియేట్ చేసే విధానం మరియు పాస్వర్డ్ మార్పు నకు సంబంధించిన VEDIO
2 మనం డబ్బులు చెల్లించే వారి(shop owner) వారి వివరాలను PFMS Website లో నమోదు చేసే విధానం నకు సంబంధించిన VEDIO
3. School grant ను డబ్బులు చెల్లించే వారికి చెక్ PPA జనేరట్ చేసే విధానం VEDIO
4. మన స్కూల్ గ్రాంట్ మన అకౌంట్ లో జమ అయ్యాయా లేదా ఎంత జమ అయినది తెలుసా కొనుట గురించి VEDIO
SJS LEAVES
సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు వాడుకొను విధానం
👉మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017. ప్రకారం SJS లీవ్స్ 16 రోజులు నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది.
👉 ఇవి పరిహార (compensatary) సెలవులు
👉వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..
👉వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.
👉 వీటిని Half Day సాంక్షన్ చేయరాదు.
👉1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..
👉అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..
👉 వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.
👉ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.
👉Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.
👉 వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.
👉వీటిని OCL గా ట్రీట్ చేయాలి.
👉Regular ELs కాదు కావున prefix,Suffix కోసం వాడరాదు..
How to withdraw cash with UPI APP(Google pay,Phonepe even without an ATM card
ATM కార్డు లేకున్నా UPI APP(GOOGLE PAY, PHONEPE) తో నగదు తీసు కొనే విధానం
ATM కార్డు లేకున్నా ATM నుంచి నగదుతీసుకోవచ్చు. యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా నగదు తీసు కొనుటకు అవకాశమున్నది. కార్డు లేనప్పటికీ ATM నుంచి నగదు ఉపసంహరణలకు ఇంటరాపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రా యల్ (ICCW) ఫీచర్ వీలు కల్పిస్తు న్నది మరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఐసీసీడబ్ల్యూను ప్రోత్సహిం చాలని బ్యాంకులకు సూచిస్తున్నది. క్లోనింగ్, స్కిమ్మింగ్ తదితర సైబర్ మోసాలను అరిక ట్టేలా ATM ల లో ICCW ఆప్షన్ ను పెట్టాలంటున్నది. SBI, PNB, HDFC బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులన్నీ తమ ATM ల్లో కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రా యల్ సౌకర్యాన్ని ఇప్పటికే అందుబా టులోకి తెచ్చాయి కూడా. దీంతో ఇప్పుడు గూగుల్ పే పేటీఎం ఇతర ఏ యూపీఐ పేమెంట్ సర్వీస్(UPI) యాప్స్ విని యోగం ద్వారా నైనా నగదును ఉప సంహరించుకోవచ్చు. అయితే రూ.5,000 వరకు మాత్రమే తీసుకోవడానికి వీలున్నది.
UPI ద్వారా ATM ల నుంచి కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్స్ కోసం బ్యాంకులు ఎటువంటి అదనపు చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం లేదు. అయితే వేర్వేరు బ్యాంకుల ఏటీఎంల నుంచి పరిమితికి మించి నగదు ఉపసంహరణలు చేసినట్టయితే కార్డు లావాదేవీలకున్నట్టే చార్జీలు వర్తిస్తాయి.
తీసుకునే విధానం
👉 తొలుత మీరు ATM వద్దకు వెళ్లి దాని స్క్రీన్ పైన 'విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి.
👉విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉంటే యూపీఐ ఆప్షను ఎంచుకోవాలి
👉మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి (రూ.5,000 దాటరాదు)
*👉5000రూపాయల లోపు amount enter చేసి CONTINUE పై క్లిక్ చేయండి.
👉ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్ పైన క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
👉 మీ మొబైల్లో ఉన్న UPI అప్ ని అనగా గూగుల్ పే కాని, ఫోన్ పే కానీ ఓపెన్ చేసి ఈ కోడ్‌ను స్కాన్ చేయాలి.
👉 ఆపై మీ యూపీఐ పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
👉ATM screen పైన CONTINUE పై క్లిక్ చేయండి.
👉 వెంటనే ఏటీఎం మిషన్ నుంచి నగదును తీసుకోవచ్చు.
CHILDREN EDUCATION FEE REIMBURSEMENT SOFTWARE
CHILDREN EDUCATION FEE REIMBURSEMENT SOFTWAR Download Children Education Fee Reimbursement software from below 👇👇👇 CHILDREN EDUCATION ...
-
How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal 1. క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయగానే EHS web portal ఓపెన్ అవుతుంద...
-
Check Telangana RTO e Challan/Penalty on your Vehicle Telangana Police integrated e-Challan system ద్వారా మీ వాహనం సిగ్నల్ జంపింగ్, రాం...
-
TG ZPGPF ANNUAL SLIPS DOWNLOAD INSTRUCTIONS TS ZPGPF వార్షిక స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు సూచనలు 1.క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే...










