Special Disability Leave In Telugu
ప్రత్యేక ఆశక్తత సెలవు
1. ఫండమెంటల్ రూల్ 83 ప్రకారం విధి నిర్వాహణ సందర్భంలో గాయపడి అశక్తులైన శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులకు ఈ సెలవు మంజూరుచేయబడుతుంది.
2.సంఘటన జరిగిన మూడు నెలలలోగా అశక్తత స్పష్టమైన సందర్భంలోనే ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. *[(Fundamental Rule-83(1)]*
3. 24 నెలలకు మించకుండా వైద్యాధికారి సిఫారసు మేరకు ఈ ప్రత్యేక అశక్తత సెలవును మంజూరుచేయు అధికారం ప్రభుత్వానికే తప్ప ఏ ఇతర అధికారులకు లేదు.
4.గజిటెడ్ ఉద్యోగుల విషయంలో అయితే మెడికల్ బోర్డు,NGO ల విషయంలో సివిల్ సర్జన్ సర్టిఫికెట్ జారిచేయాల్సి వుంటుంది. *[(Fundamental Rule-83(3)]*
5. కాని సెలవు రెండు నెలలకు మించని పరిస్థితులలో ప్రభుత్వ వైద్యాధికారి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. *(G.O.Ms.No.40 Fin తేది:03-06-1991)*
6.ఈ సెలవు ఇతర సెలవులతో కలిపి కూడా మంజూరుచేయవచ్చు.ఈ సెలవు ఏ సెలవు ఖాతా నుండి తగ్గించకూడదు.
7.ఈ సెలవు కాలంలో ఉద్యోగులకు 120 రోజులకు పూర్తి జీతం.మిగితా కాలానికి సగం జీతం మంజూరుచేస్తారు.
8. కార్యాలయం నుండి ఇంటికి,ఇంటి నుండి కార్యాలయానికి వేళ్ళుచున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల అశక్తతకు గురియైతే ఈ సెలవు మంజూరు చేయడానికి వీలులేదు.
9. కాని ఒక కార్యాలయం నుండి మరోక కార్యాలయానికి,కోర్టుకో లేక ఫీల్డులో కార్యస్థానమునకు వెళ్ళు సందర్భంలో ప్రమాదానికి గురై అశక్తులైన ఉద్యోగులు ఈ సెలవుకు అర్హులు. *(G.O.Ms.No.133 F&P తేది:19-06-1991)
Leave Not Due In Telugu
సంపాదించని సెలవు
1. లీవ్ రూల్స్ 1933లోని రూలు 15 C, 18 C& 25& G.O.Ms.,N o, 543, Fin. తేది : 7-12-1977 ప్రకారం ఈ సెలపు మెడికల్ సర్టిపికెట్ పై మాత్రమే సగం జీతపు సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భీవిష్యత్తులో ఆర్థించబోయే సగం జీతపు సెలవు వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేస్తారు.
2. మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేస్తారు
3. సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతపు సెలవులో పొందే సెలవు జీతం మరియ భత్యములు చెల్లిస్తారు
Special Casual Leave In Telugu
ప్రత్యేక ఆకస్మిక సెలవులు
1. ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.
2. ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.
3.ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు.
4. క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు. *(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)*
5. సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.
6. రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది. *(G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)*
Casual Leave In Telugu
సాధారణ సెలవు
1. ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది .
2.ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు.
3. ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి. *(G.O.Ms.No.52 Dt:04-02-1981)*
4. సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు. *(G.O.Ms.No.2465 Fin Dt:23-12-1959)* *(G.O.Ms.No.2094 Fin Dt:22-04-1960)*
5. ఒక క్యాలెండర్ సం॥ లో 5 ఆప్షనల్ హాలిడేస్ ను,3 లోకల్ హాలిడేస్ ను వినియోగించుకోవచ్చును.లోకల్ హాలిడేస్ అకాడమిక్ సం॥ వాడుకోవాలి. *(G.O.Ms.No.1205 Edn Dt:23-10-1981)*
6. సెలవు నియమావళి ప్రకారం అర్ధజీత, సంపాదిత, జీతనష్టపు సెలవుతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని సాధారణ సెలవును జతపరుచుటకు వీలులేదు.
7. సెలవు అనేది హక్కుగా పరిగణించరాదు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంజూరుచేసే అధికారికి ఏ రకమైన సెలవునైనా సహేతుక కారణాలతో నిరాకరించుటకు లేదా మధ్యలోనే రద్దుచేయుటకు విచక్షణాధికారం ఉంటుంది- *FR-67*
8. అర్ధ రోజునకు కూడా సాధారణ సెలవు మంజూరు చేయవచ్చును.అయితే ఒంటిపూట బడుల విషయంలో వీలుపడదు. *(G.O.Ms.No.112 Fin Dt:03-06-1966)*
9. విధినిర్వాహణ ద్వారా మాత్రమే సెలవు సంపాదించబడుతుంది *FR-60*
10. సెలవు లేకుండా డ్యూటీకి గైర్హాజరు కారాదు. నిబంధనల ప్రకారం సెలవు గాని,పర్మిషన్ గాని ముందస్తు అనుమతితోనే వినియోగించుకోవాలి.ఎట్టి దరఖాస్తు పంపనపుడు ప్రధానోపాధ్యాయుడు *గర్హాజరును* హాజరు పట్టికలో నమోదు చేయవచ్చును- *A.P.E.R Rule-155*
Child Care Leave In Telugu
శిశుసంరక్షణ సెలవు
మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం *జివో.209 తేది:21-11-2016* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
1.90 రోజుల సీసీయల్ ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.
2.180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.
3.ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.
4.40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.
5.ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
6.మహిళా ఉద్యోగుల,టీచర్ల పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరుచేస్తారు.
7.పిల్లల పరీక్షలు,అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం.
8.శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు.కేవలం సెలవు పత్రం సమర్పించి సీసీయల్ పై వెళ్ళకూడదు.అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి.
9.మొదటి విడత సీసీయల్ మంజూరు సమయంలో పుట్టినతేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి.ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.
10.ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.
11.ఆకస్మికేతర సెలవు(OCL) కు వర్తించే ప్రిఫిక్స్,సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.
12.శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.
13.ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు. G.O.Ms.No.209 Fin Dt:21.11.2017
చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు
సందేహము:-చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?
సమాధానము:-
G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారంవివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును.జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.
సందేహము:- చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
సమాధానము:-
చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.
సందేహము:- చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:
వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.
సందేహము:- మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?
సమాధానము:
చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.
సందేహము:- సర్రోగసి,దత్తత ద్వారా సంతానం పొందిన .మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
సమాధానము:- అర్హులే,90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.
సందేహము-భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:- వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.
సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
సమాధానము:
అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.
సందేహము:- పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?
సమాధానము:
GO.209 point.3 లో ఇలా ఉన్నది “Children needs like examinations,sickness etc”, అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.
సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్ వర్తిస్తాయా ?
సమాధానము:
వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.
Maternity Leave In Telugu
ప్రసూతి సెలవులు
1.వివాహం ఐన మహిళా ఉద్యోగికి కాన్పుకు 180 రోజులు జీతం తో కూడిన సెలవు మంజూరు చేయబడుతుంది. *(G.O.Ms.No.152 తేది:04-05-2010)* |
2.ఈ సెలవు ఇద్దరు జీవించి యున్న పిల్లలు వరకు మాత్రమే వర్తిస్తుంది. *(G.O.Ms.No.38 తేది: 13-08-1992)* |
3.అంతే గానీ ఎన్నో సారి ప్రసూతి సెలవు వాడుకుంటున్నారు? అనే దానితో సంబంధం లేదు. |
4.చనిపోయిన బిడ్డను ప్రసవించినా ఈ సెలవు వర్తిస్తుంది. *(DSE Lr.Dis.No.1941 తేది:11-06-1990)* |
5.కాన్పు నాటికి ఇద్దరు కంటే తక్కువ జీవించి యున్న పిల్లలు ఉన్నపుడు మాత్రమే ఈ సెలవు అనుమతి0చ బడుతుంది. |
6.మొదటి కానుపులో ఒక్కరు, రెండవ కాన్పు లో కవలలు జన్మించినా దీనిని వాడుకోవచ్చు. |
7.మొదటి కాన్పులో కవలలు పుట్టి, ఇద్దరూ జీవించి ఉంటే రెండవ కాన్పుకు ప్రసూతి సెలవు వర్తించదు. *(G.O.Ms.No.37 తేది:26-02-1996)* |
8.వేసవి సెలవుల్లో ప్రసవించిన,ఆ తేదీ నుండి 180 రోజులు ప్రసూతి సెలవు మంజూరుచేస్తారు. *(G.O.Ms.No.463 Dt:04-05-1979)* |
9.వేసవి సెలవుల్లో మధ్యలో ప్రసూతి సెలవు పూర్తి ఐన ,ముందస్తు అనుమతి తో రీ ఓపెన్ నాడు విధులలో చేరవచ్చు. |
10.వైద్య ధ్రువ పత్రం ఆధారంగా ఇతర సెలవుల ను ప్రసూతి సెలవులకు ముందు లేక వెనుక కలిపి వాడుకోవచ్చు. *(Sub Rule 2 under FR-101)* |
11.ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు మామూలుగా పొందుతున్న అన్ని కంపెన్సేటరి భత్యములు పొందవచ్చును. *(Ruling 10 under FR-44)* |
12.ప్రసూతి సెలవు మధ్యలో ఇంక్రిమెంట్ ఉన్న సందర్భంలో విధులలో చేరిన తర్వాత మాత్రమే మంజూరు చేయబడుతుంది. *(Memo.No.49463 తేది:06-10-1974)* |
13.*APFR 101(a)* "A competent authority may grant leave on average pay to married female government employees temporary or permanent for a period not exceeding 180 days in the case of *CONFINEMENT* *Commentary Confinement means:* The act of confining or the state of being confined. The period from the onset of labour to the birth of a child (Gynaecology & Obstetrics) there is no word that prescribes delivery should have been taken place. In brief it may be concluded that maternity leave may be sanctioned from the date prior to the date of delivery.i.e.,from the onset of labour pains.Only the certificate from a medical officer with less than two surviving children. డెలివరీ అయి ఉండాలన్న నియమమేమీలేదు.అందుచేత డెలివరీ ముందు తేది నుండి కూడా డాక్టర్ సర్టిఫికెట్ మేరకు మంజూరు చెయ్యవచ్చును. |
14."Leave Salary is payable in India after the end of each calender month" అందువల్ల ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉపాధ్యాయినిలు నెలనెలా జీతం పొందవచ్చు. *[(Sub Rule 32 of Fundamental Rule 74(a)]* |
15.ప్రసూతి సెలవును ఏ ఇతర సెలవులతో నైనా అనుసంధానం చేసుకోవచ్చును. బిడ్డ జన్మించిన తర్వాత సదరు తల్లి (ఉద్యోగి)యొక్క ఉపస్థితి అవసరమైతే డాక్టర్ సర్టిఫికెట్ మేరకు మెడికల్ లీవ్ అనుమతించవచ్చును. Regular Leave in continuation of maternity leave may be also granted in case of illness of a newly born baby,subject to the female governament servant produced medical certificate to the effect that the condition of the ailing baby warrants mother's personnel attention and her presence by the baby's side is absolutely necessary vide *G.O.Ms.No.2391,Fin Dated 03-10-1960* |
Extra Ordinary Leave on Loss of Pay In Telugu
EOL సెలవులు
1.ఉద్యోగికి ఏ సెలవు అందుబాటులో లేనప్పుడు (లేదా) ఇతర సెలవులున్నప్పటికి వ్రాతపూర్వకంగా అసాధారణ సెలవు మంజూరు కొరినప్పుడు ఈ సెలవును మంజూరు చేస్తారు.
2.ఈ సెలవు కాలమును సీనియార్జీ. పదోన్నతులకు లెక్కిస్తారు. ఒకేసారి 5సం॥|లకు మించి ఈ సెలవులో ఉన్నచో ఉద్యోగము నుండి తొలగించబడినట్లు భావింపబడుతుంది.
3.ఈ రకపు సెలవును 3సం|లకు వరకు పెన్షన్ను లెక్కలోనికి తీసుకుంటారు EOL కు సరిపడా దినములు ఇంక్రిమెంట్లు వాయిదాపడును.
4.శాస్త్ర సాంకేతిక చదువుల నిమిత్తంగాని, అనారోగ్య కారణంగా గాని జీత నష్టపు సెలవు తీసుకొనినచో ఆరునెలలు వరకు డైరెక్టరు, ఆరునెలల పైబడినచో ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఇంక్రిమెంట్లు వాయిదా పడకుండా అనుమతించవచ్చు. (G.O.MS.No.214 F&P dt:3.9.96) ప్రకారం 5సం॥లు జీతము లేని సెలవుపై ప్రభుత్వ అనుమతి పాంది విదేశాలలో ఉద్యోగమునకు వెళ్లవచ్చును. పై చదువులకు వెళ్లదలచిన ఉద్యోగులకు వేతనముతోగాక EOL పై మాత్రమే అనుమతించబడినది. (Memo No. 13422/C/274/FR-1/2009 dt.21.5.2009)
5.ప్రభుత్వ ఉద్యోగుల సెలవు విషయంలో 1933 నాటి సెలవుల నియమావళికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Ms.No.129 dt.1.6.2007) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 5-ఎ రూల్ తరువాత 5-బి రూల్ పేరుతో కలిసిన ఈ సవరణల ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి ఉద్యోగానికి గైర్హాజరైతే కూడా రాజీనామా చేసినట్లుగా భావిస్తారు. అయితే రాజీనామా చేసినట్లుగా పరిగణించడానికి ముందు కారణాలను వివరించేందుకు తగిన అవకాశం కల్పిస్తారు.
Half Pay Leave
అర్థజీతపు సెలవు
1.ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు. |
2.సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967) |
3.ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు. |
4.అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు. |
5.అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు. 1⃣ వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate) 2⃣ స్వంత వ్యవహారాలపై (Private Affairs) |
6.సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును. |
7.ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు. |
8.వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు. {APLR 15(B) & 18(B} |
9.కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది. (G.O.Ms.No.186 Dt:23-07-1975) |
10.సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B} |
11.ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి. |
12.వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి. |
13.వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005) (Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011) |
14.అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడవు. |
15.క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును. (G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No.449 Dt:19-10-1976) |
16.వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. (G.O.Ms.No.29 Dt:09-03-2011) |
17.ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968) |
18.ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి. |
19.సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు. (G.O.Ms.No.33 F&P Dt:29-01-1976) |
Earned Leaves In Telugu
సంపాదిత లేక ఆర్జిత సెలవులు
1.ఈ సెలవుకు సంబంధించిన నిబంధనలు. నియామకాలు G.O.Ms. No. 384, Fin. 80 27-1-1979 ఉత్తర్వులు జారీచేసియున్నారు. |
2.సర్వీసుల యందు పనిచేయుచున్న ఉద్యోగులకు డ్యూటీ కాలానికి ప్రతి ఆరునెలలకు అనగా సంవత్సరంలో జనవరి నెల ఒకటప తేది నాటికి 15 రోజాల చొప్పున, అదేవిదంగా జులై ఒకటవ తేదీన 15 రోజులు అడ్వాన్స్ గా జమ చేయబడుతుంది. |
3.ఉపాధ్యాయులకు G.O.Ms. No. 317, Fn తేది : 15-09-1994 ప్రకారం సంవత్సరానికి 6 చొప్పున సంపాదిత సెలపులు జమచేయబడతాయి. జనవరి నెల ఒకటప తేది నాటికి 3 రోజాల చొప్పున, అదేవిదంగా జులై ఒకటవ తేదీన 3 రోజులు అడ్వాన్స్ గా జమ చేయబడుతుంది. |
4.రెగ్యులర్ కానీ తాత్కాలిక ఉద్యోగులకు సగం రోజులకు మాత్రమే అర్హత కలిగి ఉంటారు. |
5.ఈ సెలవులు 300 రోజులకు మించి నిల్వ ఉండదు. రిటైరైనప్పుడు 300 రోజులకు మించకుండా నగదు చెలిస్తారు. ( G.O.Ms.No.232 Dt: 16.9.2005) |
వేసవిలో సంపాదిత సెలవులు
TSGLI INFORMATION
TSGLI Information |
|
---|---|
TSGLI Annual Slips | CLICK HERE |
TSGLI Policy Bond Download | CLICK HERE |
TSGLI Policy Details | CLICK HERE |
TSGLI Policy Search | CLICK HERE |
Download TSGLI All Forms | CLICK HERE |
Academic Calendar 2022-23
Academic Calendar 2022-23
# విద్యా సంవత్సరం (2022-23) మొత్తం 230 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.
# రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో విద్యార్థులకు 5 నిమిషాలపాటు యోగా, ధ్యానం.
# అంగ మాధ్యమం ప్రవేశపెట్టిన నేపధ్యంలో ప్రతివారం 'కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్‌ఇంగ్రిష్' పేరిట ఒక పిరియడ్‌ను నిర్వహిస్తారు. ఇందులో అంగ్ల పత్రికలు చదివించడం, కథలు చెప్పడం, కథల పస్తకాలు చదవడం, డ్రామా. దిన్ననాటికలు వేయడం వంటి కార్టకమాలను ఆమలుచేస్తారు.
వరీక్షల టైం టేబుల్ ...
@ ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1: జులై 21 నాటికి పూర్తి
@ ఎఫ్‌ఎ 2: సెప్టెంబరు 5వ తేదీలోవు
@ సమ్మేటివ్ అసెస్‌మెంట్-1: నవంబరు 1 నుంచి 7 వ తేదీ వరకు
@ ఎఫ్‌ఎ3: డిసెంబరు 21 నాటికి పూర్తి
@ ఎఫ్ ఎ 4 ; పదో తరగతికి 2023 జనవరి 31 నాటికి, మిగిలిన వాటికీ ఫిబ్రవరి 28 నాటికి
@ ఎస్‌ఏ-2 : 2023 ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు (1-9 తరగతులకు)
@ పదో తరగతికి ప్రీ పైనల్ పరీక్షలు: 2023 ఫిబ్రవరి 28 కి ముందు
@ పదో తరగతి చివరి పరీక్షలు: 2023 మార్చిలో
@ చివరి పని దినం: 2023 ఏప్రిల్ 24.
@ వేసవి సెలవులు: ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు
@ మళ్ళీ పాఠశాలల పునషపారంభం: 2023 జూన్ 12వ తేదీ నుంచి
పండుగ సెలవులు
@ దసరా: సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వ తేది వరకు 14 రోజులు
@ క్రిస్మస్ సెలవులు (మిషనరీ పాఠశాలలకు): డిసెంబరు 22 నుంచి 28 వరకు 7 రోజులు
@ సంక్రాంతి సెలవులు: 2023 జనవరి 13 నుంచి 17 వ తేదీ వరకు 5 రోజులు
CLICK HERE DOWNLOAD HERE👇
How to Download TS ZP GPF Slips details Available Here
How to Download TS ZP GPF Slips details Available Here
Telangana Employees who have appointed under local body can open ZP GPF account and can deduct some amount and deposit in ZP GPF
After open the account there will be allotted a registered number which can be use for download Anual statement here we have arranged all details how to download let's read below
How to Download TS ZP GPF Anual Slips
1- First visit the official website which has given below in bottom
2-Then Official website Will open
3- And Select Your District Through Given Drop down list
4- Now Enter Your ZP GPF Number
5- Enter text the Default password (Ex= emp1234 / emp your GPF Account Number)
6-Enter the Captcha
7- Then Click on submit button
8- You will see Your account details
9- Download desired year Anual Slips
Download from below link
How to rebuild in case of lost / unrecognized service register ??
*📕సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి??*
★ సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
★అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం
*G.O.Ms.No.202 F&P తేది:11.06.1980*
ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
★ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
★ ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.
★ అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి,అట్టి విషయములను సమాంతర(Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి
*G.O.Ms.No.224 F &P తేది:28.8.1982*
★ పుట్టినతేది,ఉద్యోగ నియామకం,తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి చెంతనున్న వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు. అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
★ ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల,అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
★పుట్టినతేది,విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.
★ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున,శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదేవిధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.
★ శాఖాపర పరీక్షలు (Departmental Tests) పాస్ అయిన వివరములు సర్వీసు కమీషన్ వారిచే ప్రచురించబడిన ఉద్యోగ సమాచార పత్రిక,గెజిట్ నుంచి గాని లేదా ప్రస్తుతం TSPSC వెబ్సైట్ ద్వారా గాని దృవీకరించుకోవచ్చును.
PAY SLIP FOR -APRIL 2024
PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...
-
TS 10th CLASS EXAMINATION RESULTS 2024 10వ తరగతి పరీక్ష ఫలితాలు నేడు (30-04-2024) ఉదయం 11 గంటల కు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెం...
-
TS INTERMEDIATE EXAMINATION RESULTS 2024 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు నేడు (24-04-2024) ఉదయం 11 గంటల కు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో ఇంటర్...
-
CLICK BELOW IMAGES FOR REQUIRED PAPER HERE కావలసిన పేపర్ పైన క్లిక్ చేయండి 👇👇👇 FOR ENGLISH NEWS PAPERS CLICK BELOW IMAGES ...