CHILDREN EDUCATION FEE REIMBURSEMENT SOFTWARE





TELANGANA TUITION FEE REIMBURSEMENT

ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ – ముఖ్యమైన వివరాలు

◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 4 వ తరగతి ఉద్యోగులు మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగులందరికి ఈ సదుపాయం వర్తిస్తుంది.

◆ ఎల్‌కెజి నుండి ఇంటర్మీడియట్ / 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇద్దరికి మించకుండా వర్తిస్తుంది.

◆ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో మాత్రమే పిల్లలు చదువుతూ ఉండాలి.

◆ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజు ఉండదు కాబట్టి ఆయా పాఠశాలలలో చదివే వారికి ఈ వర్తింపు ఉండదు.

◆ ట్యూషన్ ఫీస్ రీయింబర్స్‌మెంట్ చేయమని కోరుతూ DDO కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటుగా పాఠశాల నుండి స్టడీ సర్టిఫికెట్, పాఠశాల గుర్తింపు కాపీ, ఫీజు చెల్లింపు రసీదులను జత చేయాలి.

◆ పదవ పే రివిజన్ కమిషన్, 2015, ట్యూషన్ ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను సంవత్సరానికి ఒక్కో పిల్లవాడికి రూ.1000/- నుండి రూ.2500/- (రూ. రెండు వేల మరియు ఐదు వందల మాత్రమే) పెంచుతూ ప్రతిపాదన చేసింది.

◆ తెలంగాణ రాష్ట్రం 10 వ PRC రికమండేషన్ ప్రకారం ఈ మొత్తాన్ని 2500/-కి పెంచుతూ ఉత్తర్వులు సంఖ్య 27 తేదీ 24.09.2015 విడుదల చేసింది.

ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ – నిబంధనలు

◆ ఇటీవల ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దీనిపై Memo.No. 9782/593/A/Admin.I/2017 తేది: 23.7.2018 ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది.

◆ 010 పద్దు ద్వారా జీతాలు డ్రా చేస్తున్న నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు అర్హులు.

◆ ఉద్యోగుల పిల్లలు చదివే పాఠశాల రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందియుండాలి.

◆ భార్య, భర్త ఇరువురు ఉద్యోగస్థులైన ఒకరు మాత్రమే ఈ రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేయాలి.

◆ ఉద్యోగంలో ఒకరు గజిటెడ్, మరొకరు నాన్ గజిటెడ్ ఉంటే ఈ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

◆ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉంటే రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

◆ అకడమిక్ సంవత్సరం పూర్తయిన తరువాత ఒరిజినల్ ఫీజు రశీదులు జతచేయాలి.

◆ పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అటెస్టేషన్ తప్పనిసరి.

Download Children Education Fee Reimbursement software from below

👇👇👇

CHILDREN   EDUCATION FEE REIMBURSEMENT SOFTWARE 

Download Children Tution Fee Reimbursement Application form from below   

                          👇👇👇        

                  Application Form

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Download Departmental Test Hall Tickets

 DOWNLOAD  DEPARTMENTAL TEST HALL TICKETS Notification No. 04/2026, Dt. 24/09/2026 DEPARTMENTAL TESTS - NOVEMBER, 2026 SESSION HALL TICKETS ...