ATM కార్డు లేకున్నా UPI APP(GOOGLE PAY, PHONEPE) తో నగదు తీసు కొనే విధానం
ATM కార్డు లేకున్నా ATM నుంచి నగదుతీసుకోవచ్చు. యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా నగదు తీసు కొనుటకు అవకాశమున్నది. కార్డు లేనప్పటికీ ATM నుంచి నగదు ఉపసంహరణలకు ఇంటరాపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రా యల్ (ICCW) ఫీచర్ వీలు కల్పిస్తు న్నది మరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఐసీసీడబ్ల్యూను ప్రోత్సహిం చాలని బ్యాంకులకు సూచిస్తున్నది. క్లోనింగ్, స్కిమ్మింగ్ తదితర సైబర్ మోసాలను అరిక ట్టేలా ATM ల లో ICCW ఆప్షన్ ను పెట్టాలంటున్నది. SBI, PNB, HDFC బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులన్నీ తమ ATM ల్లో కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రా యల్ సౌకర్యాన్ని ఇప్పటికే అందుబా టులోకి తెచ్చాయి కూడా. దీంతో ఇప్పుడు గూగుల్ పే పేటీఎం ఇతర ఏ యూపీఐ పేమెంట్ సర్వీస్(UPI) యాప్స్ విని యోగం ద్వారా నైనా నగదును ఉప సంహరించుకోవచ్చు. అయితే రూ.5,000 వరకు మాత్రమే తీసుకోవడానికి వీలున్నది.
UPI ద్వారా ATM ల నుంచి కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్స్ కోసం బ్యాంకులు ఎటువంటి అదనపు చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం లేదు. అయితే వేర్వేరు బ్యాంకుల ఏటీఎంల నుంచి పరిమితికి మించి నగదు ఉపసంహరణలు చేసినట్టయితే కార్డు లావాదేవీలకున్నట్టే చార్జీలు వర్తిస్తాయి.
తీసుకునే విధానం
👉 తొలుత మీరు ATM వద్దకు వెళ్లి దాని స్క్రీన్ పైన 'విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి.
👉విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉంటే యూపీఐ ఆప్షను ఎంచుకోవాలి
👉మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి (రూ.5,000 దాటరాదు)
*👉5000రూపాయల లోపు amount enter చేసి CONTINUE పై క్లిక్ చేయండి.
👉ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్ పైన క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
👉 మీ మొబైల్లో ఉన్న UPI అప్ ని అనగా గూగుల్ పే కాని, ఫోన్ పే కానీ ఓపెన్ చేసి ఈ కోడ్ను స్కాన్ చేయాలి.
👉 ఆపై మీ యూపీఐ పిన్ నంబర్ను ఎంటర్ చేయాలి.
👉ATM screen పైన CONTINUE పై క్లిక్ చేయండి.
👉 వెంటనే ఏటీఎం మిషన్ నుంచి నగదును తీసుకోవచ్చు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.