రక్త పోటు నియంత్రణ లో ఉంచు కోవడం ఎలా?
👉ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య రోజు రోజు పెరిగిపోతోంది. చిన్న వయసు లొనే రక్త పోటు బారిన పడుతున్నారు.
👉ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అధిక ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు.
👉 ఇక ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటుతో బాధపడేవారూ పెరిగిపోతున్నారు.
👉 రక్తపోటు ఎక్కువగా ఉంటే, స్ట్రోక్,గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
👉మైదా, పంచదార, తెల్ల బియ్యం, కేకులు, బర్గర్లు, వైట్ బ్రెడ్ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తినక పోవడం మంచిది.
జొన్నలు, బార్లీ, రాగి రొట్టె లేదా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ బ్రెడ్ తినండి
👉 అధిక రక్తపోటు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 30-40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
లేదా 30 నిమిషాల పాటు జాగింగ్ చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
👉 అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండండి
👉అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ఒత్తిడినితగ్గించుకోవడం చాలా మంచిది
👉జొన్నలు, బార్లీ, రాగి రొట్టె లేదా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ బ్రెడ్ తినండి
👉తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.
👉బీపీ ఉన్న వాళ్లు పచ్చళ్లు, ప్యాకేజ్ ఫుడ్డు తదితర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
👉 మీ బరువును ఎంత నియంత్రణలో ఉంచుకుంటే, మీ రక్తపోటు తగ్గుతుందని గుర్తుంచుకోండి.
👉అధిక రక్తపోటు ఉన్న వారికి పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు మేలు కావున ఆహారంలో , అవకాడో, సాల్మన్, ట్యూనా, నట్స్, పెరుగు మొదలైనవి ఉండేలా చూసుకోవాలి.
👉ధూమపానం, మద్యం సేవించడం తగ్గించండి. ధూమపానం లేదా మద్యం సేవించడం పరిమితం చేయడం మంచిది .
👉అధిక ఉప్పు తీసుకోవడం అధిక రక్తపోటుకు దోహదం చేస్తుంది.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.