మీ UPI ట్రాన్సాక్షన్స్ భద్రంగా ఉంచుకొనే విధానం
గూగుల్ పే ఫోన్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ వాడకం విపరీతంగా పెరిగాయి. వీటి వాడకం ఎంత పెరిగిందో మోసాలూ అంతలా పెరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది డబ్బును నష్టపోతున్నారు. సైబర్ మోసాల బారినపడకుండా కాపాడుకోవడానికి కింద సూచించిన ఐదు జాగ్రత్తలు పాటించాలి.
స్క్రీన్ లాక్
ఎవరూ కనిపెట్టలేని విధంగా స్క్రీన్ లాక్, పాస్వ ర్డ్ లేదా పిన్ పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ సేఫ్ గా ఉంటుంది.
మీ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల యాప్లను రక్షించడానికి కూడా ఇవి కీలకం.
ఇలా చేస్తే సున్నితమైన పర్సనల్, ఫైనాన్షియల్ సమాచారం లీక్ కాదు.
అనధికార వ్యక్తులకు యాక్సెస్ ఉండదు. పేరు, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సాధారణ పాస్వర్డ్లను ఉపయోగిం చకూడదు.
మీ పిన్ను షేర్ చేయవద్దు
మీ పిన్ నంబర్ను షేర్ చేయడం వలన మోసానికి గురయ్యే అవకాశం ఉంది. పిన్ నంబర్ ఉంటే మీ
ఫోన్ మోసగాళ్లు యాక్సెస్ చేయొచ్చు. మీకు తెలియకుండా లావాదేవీలు చేయొచ్చు. అందుకే మీ పిన్ నంబర్ను ఎవరికీ చెప్పకూడదు. ఎవ రికైనా తెలిసిందని అనిపిస్తే వెంటనే మార్చాలి.
యూపీఐ యాప్ అప్డేటింగ్ ముఖ్యం
యూపీఐ పేమెంట్ యాప్ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. లేటెస్ట్ వెర్షన్ను ఉపయోగిస్తేనే లేటెస్ట్ ఫీచర్లు, బెనిఫిట్స్ ఉంటాయి. గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే వీటిని డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీల సోర్స్ లను వాడక పోవడం మంచిది.
ఎక్కువ యాప్స్ వద్దు
యూపీఐ పేమెంట్స్కు ఒకటిరెండుకు మించి యాప్స్ వాడకపోవడమే మంచిది. ఎక్కువ యాప్స్ వల్ల సైబర్ ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాక ఫోన్ కెసాపిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
అన్వెరిఫైడ్ లింక్స్ జోలికి వెళ్లొద్దు
మీ కేవైసీ(KYC) అప్డేట్ చేయాలని లేదా ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి తాము పంపిన లింక్ క్లిక్ చేయాలంటూ సైబర్ క్రిమినల్స్ పంపే మెసేజ్ ను పట్టించుకోకూడదు. వాటిపై క్లిక్ చేస్తే మన అకౌంట్లోని డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది. అంతేగాక పిన్ నంబర్, ఓటీపీ వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదు. వెరిఫికేషన్ కోసం థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరితే తిరస్కరించాలి. బ్యాంకులు ఇలాంటివి ఎప్పుడూ అడగవు. తెలియని లేదా అనుమానాస్పదంగా అనిపించే నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా పట్టించుకోకూడదు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.