బ్యాచిలర్ డిగ్రీతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నభారతీయ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ వాతావరణ శాఖ విభాగాల్లోని 990 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ/ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 30.09.1992 నుండి 18.10.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. అలాగే రాత పరీక్షలు డిసెంబర్ 2022 న నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష తేదీలు, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 990
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, అక్టోబర్ 18 2022 నాటికి ఫిజికల్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అక్టోబర్ 18, 2022 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు (సౌత్ రీజియన్) క్రింద ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ఎంపిక విధానం:
◆ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
◆ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు.
◆ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు.
◆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కంప్రెహెన్షన్ నుండి 25 ప్రశ్నలు.
◆ జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు.
★ పార్ట్-2 విభాగంలో..
◆ ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొదలగు సబ్జెక్టుల నుండి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
◆ పరీక్ష సమయం 120 నిమిషాలు.
◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
◆ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మా కోత విధిస్తారు.
◆ ప్రశ్నల సంఖ్య 200.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూడి/ మహిళలు మాజీ-సైనికులకు ఫీజు మినహాయించారు.
మిగిలిన వారికి : రూ.100/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.ssc.nic.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.10.2022.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.