CCA RULES Info In Telugu

 రాష్ట్ర సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరికీ, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసు (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్అప్పీల్) రూల్స్ 1991 వర్తిస్తాయి. ప్రోవి్ిటలైజెషన్ చేయబడినందున పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.


వర్గీకరణ (Cassication): రాష్ట్ర సివిల్ సర్వీసు ఉద్యోగులు 1) రాష్ట్ర సర్వీసులు 2) సబార్డినేట్ సర్వీసులు క్రింద వర్గీకరించబడుదురు

అజిమాయిషీ (Control): ఉద్యోగి తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేక ఉపేక్ష వహించిన సందర్భములలో ఈ క్రింది క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడును

ఎ) స్వల్ప దండనలు: 1) అభిశంసన, 2) పదోన్నతి నిలుపుదల, 3) ప్రభుత్వమునకు కలిగిన ఆర్థిక నష్టమును రాబట్టుట ఇంక్రిమెంట్లు నిలుపుదల, 5) సస్పెన్షన్


బి) తీవ్ర దండనలు: 1) సీనియారిటీ ర్యాంక్ను తగ్గించుట లేక క్రింది పోస్టునకు / స్కేల్నకు తగ్గించుట, 2) నిర్బంధ పదవీ విరమణ, 3) సర్వీసు నుండి తొలగించుట (Removal) 4) బర్తరఫ్ (Dismissal) (సర్వీసు నుండి తొలగించబడిన ఉద్యోగి భవిష్యత్తులో తిరిగి నియామకం పొందులకు అర్హుడు. కాని డిస్మిస్ చేయబడిన ఉద్యోగి భవిష్యత్ నియామకమునకు అర్హుడు కాడు.)


దండనలు విదించు అధికారము: సాధారణంగా నియామకపు అధికారి లేక సంబంధిత ఉన్నతాధికారి పైన పేర్కొన్న స్వల్ప దండనలతోపాటు తీవ్రదండనలను కూడా విధించవచ్చు GONO.538 తేది: 20.11.98 ప్రకారం ఆం.ప్ర. స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలలోని ఉపాధ్యాయ కేడర్లందరికీ (Non-Gazetted) జిల్లా విద్యాధికారి నియామకాధికారై వున్నారు. G.O.NO.505 తేది: 16.11.98 ప్రకారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం.ఇఓ.లు, డైట్ లెక్చరర్లకు, పాఠశాల విద్య ప్రాంతీయ డైరెక్టర్లు, క్లాస్-3 వారికి డి.ఎస్.ఇ, ఆపై వారికి ప్రభుత్వం నియామకాధికారులై వున్నారు. క్రమశిక్షణా చర్యలు తీసుకొను అధికారం నియామకాధికారులకు మాత్రమే వుండును, అయితే ఎం.ఇ.ఓ. హైస్కూల్ హెడ్ మాస్టర్లకు స్వల్ప దండనలు విధించే అధికారం డి.ఇ.ఓ. దాఖలు చేయబడినది. (G.O.40) DEO, RJD, DSE విధించిన దండనలపై డి.ఎస్.ఇ గారికి అప్పిలు చేసుకోవాలి.


దండనలు విధించు విధానం: స్వల్ప దండనలు విధించు సందర్భములో ఉద్యోగి మోపబడిన అభియోగములను, శిక్షా చర్య తీసుకొనుటకు ప్రతిపాదనలను వ్రాతపూర్వకముగా ఉద్యోగికి తెలియజేయాలి. దానిపై ఉద్యోగి విరమణ ఇచ్చుకొనుటకు అవకాశము ఇవ్వాలి.


తీవ్ర దండనలు విధించుటలో మాత్రం నిర్దిష్టమైన పద్ధతి అనుసరించవలసి యున్నది :

1) విచారణాధికారి నియామకం . 2) ఛార్జీసీటు ఇచ్చుట 3) ప్రతిపాదిత ఆరోపణలపై మౌళిక లేక వ్రాతపూర్వక ప్రతిపాదనా వాంగ్మూలము ఇచ్చుటకు, ఉద్యోగికి అవకాశము కల్పించుట 4) వివిధ సాక్ష్యములను రికార్డు చేయుట, 5) విచారణాధికారి నిర్ధారణలను పేర్కొనుట 6) విచారణాధికారి నివేదిక ఉద్యోగికందించి అతని ప్రాతినిధ్యమును తీసుకొనుట.7) శిక్షించు అధికారి అంతిమ నిర్ణయం అనే విధానము అనుసరించవలసివున్నది.


సస్పెన్షన్ : తీవ్ర అభియోగములపై విచారణ జరుగుచున్నప్పుడు లేక క్రిమినల్ అభియోగముపై దర్యాప్తు లేక కోర్టు

విచారణ జరుగుచున్నప్పుడు మాత్రమే ప్రజాహితం దృష్ట్యా ఒక ఉద్యోగిని సప్సెన్షన్లలో వుంచవచ్చును. సప్పెషన్షన్ ఉత్తర్వు ఉద్యోగికి అందజేయబడిన తేదీ నుండి మాత్రమే అమలులోకి వచ్చును.


*ఉద్యోగికి 48 గంటలకు మించిన జైలు శిక్ష విధించబడినప్పుడు లేక డిటెన్షన్ క్రింది 48 గంటలు కస్టడీలో వుంచబడినప్పుడు అట్టి తేదీ నుండి సప్పెన్షన్లో వుంచబడినట్లు పరిగణిస్తారు.


*సస్పెన్షన్ కాలంలో FR53 ననుసరించి అర్ధజీతపు సెలవు కాలవు జీతమునకు సమానంగా సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇస్తారు. 6 నెలల తరువాత దానిని 50% పెంచడం గానీ, తగ్గించడం గానీ చేయవచ్చు. నియామక ఆధికారికి పై అధికారి తన సమీక్షానంతరం దానిని కొనసాగించవచ్చును. విచారణలోనుండగా సప్పెన్షన్ శిక్షా చర్యకాదు. పాక్షిక నిర్దోషి అని తేలితే సబ్సిస్టెన్స్ ఆలవెన్స్ ని తగ్గకుండా జీతం నిర్ణయం చేయవచ్చు.


అప్పీలు (Appeal) : సప్పెన్షన్ వుంచబడినప్పుడు లేక విధించబడిన శిక్ష అన్యాయమైనదిగా భావించినప్పుడు ఆ నిబంధన యొక్క అనుబంధములో చూపబడిన సంబంధిత ఆప్పిలెట్ అధికారికి మూడు నెలల గడువులోగా అప్పీల్ చేసుకొనవచ్చు. చివరిగా ప్రభుత్వమునకు అప్పీలు చేసుకొనవచ్చును.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...