2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. సెల‌వులు ఇవే..

2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. సెల‌వులు ఇవే..    

2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ క్యాలెండ‌ర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వ‌ర‌కు ఉండ‌నుంది.*

మొద‌టి ఎఫ్ఏ ( formative assessment -1)జులై 21 లోపు, ఎఫ్ఏ-2 ప‌రీక్ష‌లు సెప్టెంబ‌ర్ 5 లోపు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ సూచించింది. ఇక సమ్మెటివ్ పరీక్షలు(SA-1) 01-11-2022 నుంచి 07-11-2022 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.

మూడవ ఎఫ్ఏ పరీక్షలు 21-12-2022 లోపు, ఎఫ్ఏ- 4 పరీక్షలు 31-01-2023 లోపు 10వ తరగతి విద్యార్థులకు, 28-02-2023 లోపు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎస్ఏ - 2 (SA-2) పరీక్షలు 10-04-2023 నుండి17-04-2023 వరకు గా సూచించారు.

10 వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు 28-02-2023 కు ముందుగా నిర్వహించాలని మార్చి నెలలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అని పేర్కొనడం జరిగింది.

              టర్మ్ సెలవు

దసరా పండుగ సెలవులు:-

26-09-2022 నుండి 09-10-2022 వరకు (14రోజులు)

క్రిస్టియన్ మైనారిటీ వారికి:- (క్రిస్మస్ సెలవులు)

22-12-2022 నుండి 28-12-2022 వరకు (7రోజులు)

సంక్రాంతి సెలవులు:-

13-01-2023 నుంచి 17-01-2023 వరకు (5రోజులు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...