NEWS PAPERS TELUGU & ENGLISH

 




CLICK BELOW IMAGES FOR REQUIRED PAPER HERE

కావలసిన పేపర్ పైన క్లిక్ చేయండి
👇👇👇


FOR ENGLISH NEWS PAPERS CLICK BELOW IMAGES 

                      👇👇👇👇👇



TS EAMCET-2023 NOTIFICATION

 

 TS EAMCET-2023




 తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్,అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్ )-2023 నోటిఫికేషన్ విడుదల అయింది.

కోర్సులు:

ఇంజనీరింగ్ విభాగం(E):

B.E. / B.Tech. – బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ

B.Tech.(అగ్రికల్చర్ ఇంజినీరింగ్.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)

B.Tech.(బయోటెక్నాలజీ) (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ) (M.P.C.)

B.Tech.(డైరీ టెక్నాలజీ) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (డైరీ టెక్నాలజీ)

B.Tech. (ఫుడ్ టెక్నాలజీ (FT)) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (ఫుడ్ టెక్నాలజీ (FT))

B.Pharm (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)

ఫార్మ్-డి (M.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)

అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం(AM):

B.Sc. (నర్సింగ్)

B.Sc. (ఆనర్స్.) అగ్రికల్చర్

B.Sc. (ఆనర్స్.) హార్టికల్చర్

B.Sc. (ఫారేస్ట్రి)

B.V.Sc. & పశుసంరక్షణ

B.F.Sc. – బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్

బి.టెక్. (ఫుడ్ టెక్నాలజీ (FT))

B.Pharm.(Bi.P.C) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C)

B.Tech.(బయోటెక్నాలజీ) (Bipc) – బయో-టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (Bi.P.C.)

Pharm-D (Bi.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C.)


కావాల్సిన అర్హతలు:

ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీలలో ఎస్సీ ఎస్టీలకు 40 శాతం మార్కులు,ఇతరులకు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. బీఎస్సీ నర్సింగుకు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష రాయవలసి ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు:

తెలంగాణ రాష్ట్రంలో 16 పరీక్ష జోన్లు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం,విజయవాడ,గుంటూరు,తిరుపతి,కర్నూలు నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రిజిస్ట్రేషన్ ఫీజు :

 ఇతరులకు రూ.900

ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.500

రెండు స్ట్రీమ్ లకు ఇతరులకు రూ.1800

ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు:

ప్రారంభం మార్చి 3

చివరి తేదీ ఏప్రిల్ 10

ఆలస్య రుసుము రూ.250-చివరి తేదీ ఏప్రిల్ 15

ఆలస్య రుసుము రూ.500-చివరి తేదీ ఏప్రిల్ 20

ఆలస్య రుసుము రూ.2500-చివరి తేదీ ఏప్రిల్ 25

ఆలస్య రుసుము రూ.5000-చివరి తేదీ మే 02

పరీక్ష తేదీలు:

ఇంజనీరింగ్: మే 7, 8,9

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ: మే 10,11

వెబ్ సైట్: https://eamcet.tsche.ac.in


      

How to keep your UPI transactions secure

 మీ UPI ట్రాన్సాక్షన్స్ భద్రంగా ఉంచుకొనే విధానం




గూగుల్ పే ఫోన్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ వాడకం విపరీతంగా పెరిగాయి. వీటి వాడకం ఎంత పెరిగిందో మోసాలూ అంతలా పెరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది డబ్బును నష్టపోతున్నారు. సైబర్ మోసాల బారినపడకుండా కాపాడుకోవడానికి కింద సూచించిన ఐదు జాగ్రత్తలు పాటించాలి.


స్క్రీన్ లాక్


ఎవరూ కనిపెట్టలేని విధంగా స్క్రీన్ లాక్, పాస్వ ర్డ్ లేదా పిన్ పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ సేఫ్ గా  ఉంటుంది.

మీ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల యాప్లను రక్షించడానికి కూడా ఇవి కీలకం.

ఇలా చేస్తే సున్నితమైన పర్సనల్, ఫైనాన్షియల్ సమాచారం లీక్ కాదు.

అనధికార వ్యక్తులకు యాక్సెస్ ఉండదు. పేరు, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సాధారణ పాస్వర్డ్లను ఉపయోగిం చకూడదు.


మీ పిన్ను షేర్ చేయవద్దు


మీ పిన్ నంబర్ను షేర్ చేయడం వలన మోసానికి గురయ్యే అవకాశం ఉంది. పిన్ నంబర్ ఉంటే మీ

ఫోన్ మోసగాళ్లు యాక్సెస్ చేయొచ్చు. మీకు తెలియకుండా లావాదేవీలు చేయొచ్చు. అందుకే మీ పిన్ నంబర్ను ఎవరికీ చెప్పకూడదు. ఎవ రికైనా తెలిసిందని అనిపిస్తే వెంటనే మార్చాలి. 


యూపీఐ యాప్ అప్డేటింగ్ ముఖ్యం


 యూపీఐ పేమెంట్ యాప్ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. లేటెస్ట్ వెర్షన్ను ఉపయోగిస్తేనే లేటెస్ట్ ఫీచర్లు, బెనిఫిట్స్ ఉంటాయి. గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే వీటిని డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీల సోర్స్ లను వాడక పోవడం మంచిది.


ఎక్కువ యాప్స్ వద్దు


యూపీఐ పేమెంట్స్కు ఒకటిరెండుకు మించి యాప్స్ వాడకపోవడమే మంచిది. ఎక్కువ యాప్స్ వల్ల సైబర్ ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాక ఫోన్ కెసాపిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.


అన్వెరిఫైడ్ లింక్స్ జోలికి వెళ్లొద్దు


మీ కేవైసీ(KYC) అప్డేట్ చేయాలని లేదా ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి తాము పంపిన లింక్ క్లిక్ చేయాలంటూ సైబర్ క్రిమినల్స్ పంపే మెసేజ్ ను పట్టించుకోకూడదు. వాటిపై క్లిక్ చేస్తే మన అకౌంట్లోని డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది. అంతేగాక పిన్ నంబర్, ఓటీపీ వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదు. వెరిఫికేషన్ కోసం థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరితే తిరస్కరించాలి. బ్యాంకులు ఇలాంటివి ఎప్పుడూ అడగవు. తెలియని లేదా అనుమానాస్పదంగా అనిపించే నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా పట్టించుకోకూడదు.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...