TELANGANA GURUKUL CET-2023

 

 TELANGANA GURUKUL CET-2023

తెలంగాణ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లోప్రవేశానికి నోటిఫికేషన్



తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2023 – 24 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేసింది

కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.

👉అప్లికేషన్ ప్రారంభ తేదీ 

 09-02-2023

👉అప్లికేషన్ చివరి తేదీ :

06-03-2023

👉ప్రవేశ పరీక్ష తేదీ :

23-04-2023

👉సమయం :

ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

 👉  అప్లై చేసుకునే విధానం:-

మీ దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.   

అప్లికేషన్ వెబ్సైట్ 

    www.tswreis.ac.in

  www.tgcet.cgg.gov.in

www.tgtwgurukulam.telangana.gov.in

www.mjptbcwreis.telangana.gov.in

దరఖాస్తు రుసుము:-

100 రూపాయలు


అభ్యర్థులు  తేదీ : 09-02-2023 నుండి 06-03-2023 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును 

ఎంపిక విధానం:-

విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది

కావల్సిన అర్హతలు:-

 2022- 2023 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

OC మరియు BC పిల్లలు 01-09-2012 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).

SC మరియు ST పిల్లలు, SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు 01-09-2010 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).

సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాల్లోని వారికి 2,00,000/- లోపు ఉండాలి.

అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-

స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH 

 మొబైల్ నెంబర్

 విద్యార్థి ఆధార్ నెంబర్

కులం (వివరాలు)

 ఆదాయం ( వివరాలు).

 చదువుతున్న స్కూల్స్ అడ్రెస్

 విద్యార్థి ఫోటో

 విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు

PIN CODE NO 

ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.

పరీక్షా విధానం:-

పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది.

పరీక్షా విధానం ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఉంటాయి.( 4 సమాధానాల నుండి 1 సమాధానాన్ని ఎంపిక చేసుకోవాలి).

మొత్తం  మార్కులు-100 గా ఉంటాయి.

తెలుగు- 20 మార్కులు

ఇంగ్లీష్- 25 మార్కులు

గణితం- 25 మార్కులు

EVS- 20  మార్కులు

మెంటల్ ఎబిలిటీ- 10 మార్కులు

పరీక్షా సిలబస్:-

విద్యార్థులు తాము చదివిన ౩ మరియు 4 తరగతుల్లోని తెలుగు, ఇంగ్లీష్, గణితం, EVSల నుండే ప్రశ్నలు వస్తాయి. అదనంగా మెంటల్ ఎబిలిటీ నుండి 10 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.

ఫీజు చెల్లించుటకుCLICK HERE
అప్లై చేయుటకుCLICK

Transfers 2023 - Clarification

 

  బదిలీలు 2023 - క్లారిఫికేషన్ 








👉 *జిల్లాలోని ఉపాధ్యాయ మిత్రులు ఎవరైతే బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారో వారు దరఖాస్తు పూర్తి అయిన తర్వాత నాలుగు సెట్లు ప్రింట్ అవుట్ తీసుకోవాలి* 


👉ప్రిఫరెన్షియల్ క్యాటగిరి ఉన్నవాళ్లు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జత చేయాలి 


👉అదే విధంగా spouse కు సంబంధించిన వారు సర్టిఫికెట్స్ జత చేయాలి 


👉అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత .. కాంప్లెక్స్ సంబంధించిన ఉపాధ్యాయులైతే మీ మీ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సంతకం తో సంబంధిత మండల విద్యాధికారులకి అదే రోజు అందజేయాలి 


👉అనగా ఏ రోజు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకుంటున్నారో అదే రోజు మీ మీ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల  సంతకం తీసుకొని మండల విద్యాధికారులకు అందజేయాలి 


👉ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులైతే మీ మీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకంతో మండల విద్యాధికారులకు ఇవ్వాలి 


👉 *ఈ విషయాన్ని గమనించగలరు*


👉 *మొత్తం నాలుగు సెట్ల ప్రింట్ అవుట్ లు తీసుకోవాలి*

👉 *ఒకటి మీ దగ్గర ఉండాలి*

👉 *రెండవది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల వద్ద*

👉 *మూడవది మండల విద్యాధికారుల వద్ద*

👉 *నాలుగవది జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపిస్తారు*

👉 *కాబట్టి ప్రతి ఒక్కరూ నాలుగు సెట్టుల ప్రింట్ అవుట్ లు తీసుకోవాలి* 

👉 *బదిలీలకు సంబంధించి మరొక ముఖ్య విషయం ఏమిటంటే* 

👉 *అన్ని కేటగిరీలకు సంబంధించిన అనగా GAZ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు అందరూ కూడా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో కచ్చితంగా ఈ మూడు రోజులలోనే అప్లై చేసుకోవాలి* 👉 *ఎందుకంటే ఈ మూడు రోజుల్లో అప్లై చేసుకుంటేనే మనకు తర్వాత వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు పాఠశాలలు కనిపిస్తాయి* 

👉 *ఇప్పుడు కేవలం మనము ట్రాన్స్ఫర్ అవ్వడానికి అప్లై మాత్రమే చేస్తున్నాము దయచేసి దీనిని గమనించగలరు*


TELANGANA TEACHERS TRANSFERS AND PROMOTIONS

 

 TELANGANA TEACHERS TRANSFERS AND PROMOTIONS -2023




TEACHERS TRANSFERS & PROMOTIONS
TEACHERS TRANSFERS ONLINE APPLICATIONCLICK HERE

PRINT ONLINE APPLICATIONCLICK HERE

SPOUSE CERTIFICATECLICK HERE 

 
UNMARRIED CERTIFICATE CLICK HERE



GO.5 Date:25-01-2023:Telangana Teachers Promotions/Transfers Rules-2023: Schedule  

LAST DATE FOR SUBMISSION OF TRANSFER APPLICATION
30-01-2023


 అన్ని క్యాడర్ల ఉపాధ్యాయ బదిలీలు  వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరుగుతాయి.NCC స్పెషల్ ఆఫీసర్ లుగా ఉన్న  వారికి మాత్రం MANUAL పద్దతిలో జరుగుతాయి.

👉మినిమం సర్వీస్ 01-02-2023 నాటికి రెండు సంవత్సరాలు పూర్తయి ఉండాలి.

👉 01-02-2023 నాటికి ఒక స్టేషన్లో గరిష్టంగా ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాలు,మిగతా అన్ని క్యాడర్లకు 8 సంవత్సరాలు పూర్తయితే వారి స్థానాలు ఖాళీగా చూపించబడతాయి. వారు తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కు అప్లై చేసుకోవాలి. చేసుకోకపోతే బదిలీలు పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీలను వారికి కేటాయిస్తారు.

👉 పదవీ విరమణకు మూడు(03)సంవత్సరాల లోపు ఉంటే వారిని అదే స్టేషన్లో కొనసాగిస్తారు. వారు కోరుకుంటేనే బదిలీ చేస్తారు.

👉బదిలీలు అన్నీ కూడా ప్రస్తుతం వారు పనిచేస్తున్న మేనేజ్మెంట్ వారిగానే జరుగుతాయి.

👉 ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాల సర్వీస్ కు 17% HRA మరియు ఆ పైన పొందుతున్న వారికి సంవత్సరమునకు ఒక (01) పాయింట్.ఇస్తారు.

👉13% HRA పొందుతున్న వారికి సంవత్సరమునకు రెండు (02) పాయింట్లు ఇస్తారు.

👉 11% హెచ్ఆర్ఏ పొందుతున్న వారికి సంవత్సరమునకు మూడు (03) పాయింట్లు కేటాయిస్తారు.

👉 నాలుగవ కేటగిరి లేదు


👉 అన్ని క్యాడర్లలో చేసిన మొత్తం సర్వీస్ పూర్తి అయిన  ప్రతీ నెలకు 0.41పాయింట్ కేటాయిస్తారు.

👉 ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు పది(10) పాయింట్లు కేటాయిస్తారు.

👉 అవివాహత మహిళా ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు పది(10) పాయింట్లు కేటాయిస్తారు.

👉 స్పౌజ్ లకు 10 పాయింట్స్ ఇస్తారు. స్పౌజ్ పాయింట్లు పొందినవారు వారి స్పౌజ్ కు దగ్గరలో గల ఖాళీలకు మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులు అయితే ఒకరు మాత్రమే ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలి.5/8 సంవత్సరములలో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాలి.


*ప్రాధాన్యత కేటగిరీలు*


(a). 70 శాతం తక్కువ కాకుండా వికలాంగులైన వారికి సదరం సర్టిఫికెట్ లేదా మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికెట్ పొందిన వారికి బదిలీలలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

(b) వితంతువులకు బదిలీలలో రెండవ ప్రాధాన్యత ఇస్తారు.

(c) తిరిగి వివాహం చేసుకో నటువంటి  లీగల్ గా విడిపోయిన మహిళలకు మూడవ ప్రాధాన్యత ఇస్తారు.

(d) క్రింది జబ్బులతో వారు గాని లేదా వారి యొక్క స్పౌజ్ గాని బాధపడుతుంటే వారికి 4 వ ప్రాధాన్యత ఇస్తారు.

i. క్యాన్సర్

ii. ఓపెన్ హార్ట్ సర్జరీ

iii. న్యూరో సర్జరీ

iv. బోన్ టీబి

v. కిడ్నీ లేదా లివర్ లేదా హార్ట్ మార్పిడి

vi. కిడ్నీ డయాలసిస్

(e) మానసిక వైకల్యం గల లేదా లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) తల సేమియా లేదా మస్కులర్ డిస్ట్రోఫీ తో చికిత్స పొందుతున్న పిల్లలు గల వారికి

(f) పుట్టుకతో గుండెలో రంధ్రముగల పిల్లలు కలవారికి వైద్య సదుపాయం అందుబాటు గల ప్రాంతానికి పొందటానికి అవకాశం ఉంటుంది.

(g) పుట్టుకతోనే షుగర్ వ్యాధి గల పిల్లల కలవారికి

*గమనిక 1:* పైన పేర్కొన్న d,e,f &g వారు 01-01-2021 న కానీ తరువాత కానీ జిల్లా మెడికల్ బోర్డు లేదా స్టేట్ మెడికల్ బోర్డు నుండి పొందిన సర్టిఫికెట్ ప్రూఫ్ గా చూపించాలి

*గమనిక 2*:: ప్రిఫరెన్షియల్ కేటగిరి గాని లేదా స్పెషల్ పాయింట్స్ గాని తీసుకున్నవారు ప్రధానోపాధ్యాయులు అయితే 5 సంవత్సరములకు ఒకసారి, ఇతర క్యాడర్ల ఉపాధ్యాయులు అయితే 8 సంవత్సరములకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. వాటిని సేవాపుస్తకములో నమోదు చేయాలి.   

*గమనిక 3*:: పైన పేర్కొన్న e,f,g ల విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులు అయితే ఎవరో ఒకరు మాత్రమే ఉపయోగించుకోవాలి.

*గమనిక 4*:: పైన పేర్కొన్న b మరియు c విషయంలో సరైన ఆధారాలు చూపించాలి.

👉 ఒక ఉపాధ్యాయుడు ఒక అప్లికేషన్ మాత్రమే నియమిత ప్రొఫార్మాలో వెబ్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో నింపాలి.

👉 వెబ్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో నింపిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసి ఎంఈఓ లేదా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయానికి పంపాలి.  

👉 తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కావలసినవారు 5/8 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన వారి ఖాళీలన్నీ వెబ్ కౌన్సిలింగ్ సైట్ లో చూపుతారు.

👉 వీటితోపాటు వివిధ కారణాలతో లీవ్ లో ఉన్న వారి  ఖాళీలు మరియు జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లోని ఖాళీలను చూపించరు.

👉 ఈ క్రింద పేర్కొన్న లిస్టులను ఆర్జెడి కార్యాలయం ముందు మరియు డీఈఓ కార్యాలయం ముందు ప్రదర్శిస్తారు.

1.I,II మరియు III కేటగిరీలలో గల పాఠశాలల వివరాలు.

2. పాఠశాల వారి ఖాళీ ల వివరాలు.     

3. బదిలీకి అప్లై చేసుకున్న అందరూ ఉపాధ్యాయుల ఎన్ టైటిల్మెంట్ పాయింట్స్ కేడర్ వారీగా ఇస్తారు.

🔷 అబ్జెక్షన్ ఏమైనా ఉంటే తగిన ఆధారాలతో షెడ్యూల్ లో ఇచ్చిన టైం ప్రకారం ఆర్ జెడి కి గాని డీఈవోకు గాని అప్లై చేసుకోవాలి. 

🔷 ఒక పంచాయతీలో గల ఒక హాబిటేషన్లో  5/8 సంవత్సరముల సర్వీసు పూర్తయిన వారు మరల అదే పంచాయతీలో గల మరో పాఠశాలకు ఆప్షన్ ఇవ్వకూడదు.

🔷 ఒకసారి వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొన్న తర్వాత పాఠశాల అలాట్మెంట్ జరిగి బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు.   

🔷 వెబ్ కౌన్సిలింగ్ లో బదిలీ ఉత్తర్వులు  పొందిన వారు 23-4-2023 న

వారి పాఠశాలల నుండి రిలీవ్ అయి 24-4-2023న కొత్త పాఠశాలలో జాయిన్ కావాలి.

🔷 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి.

🔷 బదిలీ ఉత్తర్వులలో ఏమైనా అసంబద్ధతలు చోటు చేసుకుంటే బదిలీ ఉత్తర్వులు అందిన 10 రోజులలోగా పై అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలి. వారు 15 రోజుల్లోగా ఆ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తారు.









   

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...