ATM కార్డు లేకున్నా UPI APP(GOOGLE PAY, PHONEPE) తో నగదు తీసు కొనే విధానం
ATM కార్డు లేకున్నా ATM నుంచి నగదుతీసుకోవచ్చు. గూగుల్ పే , ఫోన్ పే, పేటీఎం ,ఇతర ఏ యూపీఐ పేమెంట్ సర్వీస్(UPI) యాప్స్ ద్వారా నైనా నగదును తీసుకోవచ్చు. అయితే రూ.5,000 వరకు మాత్రమే తీసుకోవడానికి వీలున్నది.
తీసుకునే విధానం
👉 తొలుత మీరు ATM వద్దకు వెళ్లి దాని స్క్రీన్ పైన 'విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి.
👉విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉంటే UPI QR CASH ఆప్షను ఎంచుకోవాలి

👉మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి (రూ.5,000 దాటరాదు)

👉5000రూపాయల లోపు amount enter చేసి CONTINUE పై క్లిక్ చేయండి.
👉ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్ పైన క్విక్ రెస్పాన్స్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
👉మీ మొబైల్లో ఉన్న UPI అప్ ని అనగా గూగుల్ పే కాని, ఫోన్ పే కానీ ఓపెన్ చేసి ఈ కోడ్ను స్కాన్ చేయాలి.

👉ఆపై మీ యూపీఐ పిన్ నంబర్ను ఎంటర్ చేయాలి.
👉ATM screen పైన CONTINUE పై క్లిక్ చేయండి.
👉వెంటనే ఏటీఎం మిషన్ నుంచి నగదును తీసుకోవచ్చు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.