Sunday, February 26, 2023

How to keep your UPI transactions secure

 మీ UPI ట్రాన్సాక్షన్స్ భద్రంగా ఉంచుకొనే విధానం




గూగుల్ పే ఫోన్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ వాడకం విపరీతంగా పెరిగాయి. వీటి వాడకం ఎంత పెరిగిందో మోసాలూ అంతలా పెరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది డబ్బును నష్టపోతున్నారు. సైబర్ మోసాల బారినపడకుండా కాపాడుకోవడానికి కింద సూచించిన ఐదు జాగ్రత్తలు పాటించాలి.


స్క్రీన్ లాక్


ఎవరూ కనిపెట్టలేని విధంగా స్క్రీన్ లాక్, పాస్వ ర్డ్ లేదా పిన్ పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ సేఫ్ గా  ఉంటుంది.

మీ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల యాప్లను రక్షించడానికి కూడా ఇవి కీలకం.

ఇలా చేస్తే సున్నితమైన పర్సనల్, ఫైనాన్షియల్ సమాచారం లీక్ కాదు.

అనధికార వ్యక్తులకు యాక్సెస్ ఉండదు. పేరు, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సాధారణ పాస్వర్డ్లను ఉపయోగిం చకూడదు.


మీ పిన్ను షేర్ చేయవద్దు


మీ పిన్ నంబర్ను షేర్ చేయడం వలన మోసానికి గురయ్యే అవకాశం ఉంది. పిన్ నంబర్ ఉంటే మీ

ఫోన్ మోసగాళ్లు యాక్సెస్ చేయొచ్చు. మీకు తెలియకుండా లావాదేవీలు చేయొచ్చు. అందుకే మీ పిన్ నంబర్ను ఎవరికీ చెప్పకూడదు. ఎవ రికైనా తెలిసిందని అనిపిస్తే వెంటనే మార్చాలి. 


యూపీఐ యాప్ అప్డేటింగ్ ముఖ్యం


 యూపీఐ పేమెంట్ యాప్ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. లేటెస్ట్ వెర్షన్ను ఉపయోగిస్తేనే లేటెస్ట్ ఫీచర్లు, బెనిఫిట్స్ ఉంటాయి. గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే వీటిని డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీల సోర్స్ లను వాడక పోవడం మంచిది.


ఎక్కువ యాప్స్ వద్దు


యూపీఐ పేమెంట్స్కు ఒకటిరెండుకు మించి యాప్స్ వాడకపోవడమే మంచిది. ఎక్కువ యాప్స్ వల్ల సైబర్ ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాక ఫోన్ కెసాపిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.


అన్వెరిఫైడ్ లింక్స్ జోలికి వెళ్లొద్దు


మీ కేవైసీ(KYC) అప్డేట్ చేయాలని లేదా ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి తాము పంపిన లింక్ క్లిక్ చేయాలంటూ సైబర్ క్రిమినల్స్ పంపే మెసేజ్ ను పట్టించుకోకూడదు. వాటిపై క్లిక్ చేస్తే మన అకౌంట్లోని డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది. అంతేగాక పిన్ నంబర్, ఓటీపీ వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదు. వెరిఫికేషన్ కోసం థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరితే తిరస్కరించాలి. బ్యాంకులు ఇలాంటివి ఎప్పుడూ అడగవు. తెలియని లేదా అనుమానాస్పదంగా అనిపించే నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా పట్టించుకోకూడదు.

TSPSC Dept.Tests NOVEMBE-2022 SESSION RESULTS

TSPSC Dept.Tests NOVEMBE-2022 SESSION RESULTS



TSPSC Dept.Tests NOVEMBE-2022 SESSION RESULTS
NOVEMBER-2022 SESSION GOT Paper Code-88&97 PHOTO SHEET RESULTS CLICK HERE
NOVEMBER-2022 SESSION EOT(A/c Test) Paper Code-141 PHOTO SHEET RESULTS CLICK HERE
NOVEMBER-2022 SESSION Spl.Language Paper CodeE-37 PHOTO SHEET RESULTS CLICK HERE
NOV-2022 SESSION Download Response Sheets CLICK HERE
NOVEMBER-2022 SESSION Know Your Hall ticket CLICK HERE


Other Paper Codes Results available below
👇👇👇






 

Monday, February 20, 2023

HOW TO SAVE INCOMETAX OTHER THAN 80C

Section80C-కి Rs150000/-అదనంగా పన్ను మినహాయింపు పొందుట గురించి




80C కింద GPF ఉద్యోగులకు 1,50,000 లు, CPS ఉద్యోగులకు 2,00,000 ల వరకు సేవింగ్స్ చూపించవచ్చు. 


ఇవి కాకుండా అదనంగా 80D కింద చూపించే అవకాశం గలవి.


Dependent ( ఉద్యోగి పై ఆధార పడిన వారు ) అనగా భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఆరుగురు .


1.GPF వారు  నేషనల్ పెన్షన్ స్కీం లో సేవింగ్స్ చేసి రూ.50,000 వరక పన్ను మినహాయుంపు లభిస్తుంది. ఇది CPS ఉద్యోగులకు వర్తించదు . ఎందుకనగా వారు తమ సాలరీ లోనే మినాహింపు అవుతుంది. అందుకే CPS వారికి 2,00,000 వరకు సేవింగ్స్ చూపించవచ్చు.



2. హోమ్ లోన్ గృహ రుణము:


హౌస్ లోన్ ఇంటరెస్ట్ టాక్స్ బెనిఫిట్ 3.5 లక్షల వరకు గ్రాస్ నుండి మినహాయింపు


 Section 24: Sec-24 IT Act ప్రకారం ఇంటియజమాని 2 లక్షల వరకు గరిష్టంగా గ్రాస్ శాలరీ నుండి మినహాయింపు పొందవచ్చు


 80EE : మీరు గృహ ఋణం 01.04.2016 to 31.03.2017 మధ్యన పొందివుంటే...50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు... మొత్తం మీద 2 లక్షలు (Sec24)+50వేలు(80EE)=Rs.2,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు...


80EEA: మీరు గృహ ఋణం 1st April 2019 and 31st March 2022 మధ్యన పొందివుంటే...1,50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు... మొత్తం మీద 2 లక్షలు (Sec24) + 1.5లక్షలు(80EE) = Rs.3,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు...


3. ప్రస్తుతం ఉన్న ఇల్లు ( పాత ) పై తీసుకునే లోన్:

హౌస్ ప్రాపర్టీ లోన్ పై కట్టే వడ్డీ ను 1,50,000 లను అదనంగా చూపించవచ్చు.


గమనిక : పై 2,3 లలో ఏదో ఒకటి మాత్రమే చూపించాల్సి ఉంటుంది. తన పేరు మీద ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.


హోమ్ లోన్ డిక్లరేషన్ ఫారం




హోమ్ లోన్ ఉన్నవారు కిరాయి కి ఉంటున్నట్లు డిక్లరేషన్ ఫారం



4. ఆరోగ్య భీమా


1.వ్యక్తిగత భీమా 25,000 ల నుండి 50,000 వరకు,

2.సీనియర్ సిటిజన్ ( తల్లిదండ్రులు ) 50,000 వరకు,

3.మెడికల్ బిల్ లు (మెడికల్ రయింబర్స్మెంట్) తీసుకొననివి.

పై మూడుంటి కలిపి 1,00,000 వరకు,

పై వాటివి లేనప్పుడు హెల్త్ చెక్ అప్ 5,000 వరకు.


టాక్స్ పడే వారు ఇప్పుడు ఆరోగ్య భీమా తీసుకుంటే కట్టే టాక్స్ లో 20% అనగా ఆరోగ్య భీమా 25,000 లు ఉంటే టాక్స్ 5,000 తగ్గుతుంది అంటే బీమా 20,000 వచ్చినట్లు. ఈ బీమా మన ఫోన్ లోన్ కొన్ని నిమిషాల వ్యవధి లోనే పొందవచ్చు.



 

 ఇక్కడ కొన్న బీమా కంపెనీల డైరెక్ట్ ల లింక్ లు ఇవ్వబడ్డాయి. మన ఫోన్ లో నే ఈ ఆరోగ్య భీమా పొందవచ్చు. రశీదు పొందవచ్చు.


a) ICICI ( ICICI Lombard ) Health Insurance 



b) Star Health Insurance Company 


c) Aditya Birla Health Insurance 


d) LIC's Arogya Rakshak (Plan No. 906, UIN : 512N318V01)


e) Bajaj Finance 


f) Medical Insurance Compare


g) TATA health insurance 


h) Max Insurance 


5. మెడికల్ ట్రీట్ మెంట్


Dependent 60 సం ల లోపు ఉంటే.40,000/-

60 సం ల పైన ఉంటే 1,00,000 వరకు సర్జరీ ద్వారా అయిన బిల్ లు. గమనిక : రీయింబర్స్ మెంట్ తీసుకోనివి.


6. విరాళాలు 


వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, సేవా కార్యక్రమాలు మరియు ధార్మిక కార్యక్రమాలు ( గుడులు, మసీదు, చర్చ్ వగైర ) లకు ఇచ్చే విరాళాల మొత్తం లో 50 % అంటే సగ భాగం ను సేవింగ్స్ కింద చూపించుకోవచ్చు. అయితే ఆయా సంస్థలు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.


ఉదా: PMNRF Prime Minister‘s National

Relief Fund, CMRF Chief Minister‘s Relief Fund, LGRF Lieutenant Governor‘s Relief Fund etc

Research or Rural Development


ఈ క్రింద క్లిక్ చేసి సేవా సంస్థలు, ధార్మిక కార్యక్రమాలు కి విరాళాలు నేరుగా మీ ఫోన్ లో నే చెల్లించి రశీదు పొందవచ్చు.


a)  అక్షయ పాత్ర అన్నదానం 


b). భద్రాచలం రాముల వారి అన్నదానం. 


c) శబరిమల అయ్యప్పస్వామి అన్నదానం.


f) మదురై మీనాక్షి కి విరాళం


e) తిరుమల తిరుపతి దేవస్థానం 


f) గోల్డెన్ టెంపుల్ అమృత్ సర్ 


g) యాదగిరి గుట్ట నరసింహ స్వామి హుండీ


h) జగన్నాథ ఆలయం హుండీ 


i) బద్రీనాథ్, కేదార్ నాథ్, దేవస్థానంలో విరాళం


j) కాశీ విశ్వనాథ్ దేవాలయం విరాళం


k) లక్ష్మి నరసంహస్వామి సింహాచలం 


PMNRF Prime minister's national relief fund 



b) CMRF:

చెక్ లేదా డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చు.  O/o CM Relief Fund, BRKR Bhavan, Telangana Secretariat Hyderabad, 500022, through Cheque or Demand Drafts drawn in favour of “Chief Minister’s Relief Fund” with permanent address along with the beneficiary details like Name and Address of the Donor, Phone Number to contact, email address and purpose of donation etc., to generate acknowledgment. Donor Category.


Donate to CM Relief Fund by Online Transfer

Account Number : 62354157651

Account Name : CM RELIEF FUND

Bank Name : State Bank of India

Branch : Secretariat, Hyderabad, Telangana

IFSC Code : SBIN0020077

లేదా UPI Paytm, Phone pe, Gpay ద్వారా చెల్లించి రశీదు పొందవచ్చు.


ఈ క్రింద గల QR కోడ్ ను స్కాన్ చేసి కూడా చెల్లించవచ్చు




b) Save the children trust


7. Educational Loan :

ఉన్నత విద్య కోసం తీసుకునే లోన్ పై కట్టే వడ్డీ ను పన్ను రాయితీ పొందవచ్చు.


8. ఎలక్ట్రిక్ వాహనం లోన్:

ఎలక్ట్రిక్ ( బ్యాటరీ) తో నడిచే వాహనాలు అనగా కార్, bike, స్కూటీ లను లోన్ లో కొనుగోలు చేస్తే వాటి పై కట్టే వడ్డీ ని సేవింగ్స్ పై చూపించవచ్చు. దీనికి గరిష్ట పరిమితి 1,50,000/-


9. ఉద్యోగి లేదా ఉద్యోగి పై ఆధారపడే కుటుంబ సభ్యులు ఎవరైనా వికలాంగుల కు 75,000 పలు రకాల వికలాంగుల కు 1,25,000 వరకు వారి చికిత్స కోసం ఖర్చు చేసిన ఎడల ఆ ఈ మొత్తం ను మినహింపు పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

Click here to view details 








Saturday, February 11, 2023

TELANGANA GURUKUL CET-2023

 

 TELANGANA GURUKUL CET-2023

తెలంగాణ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లోప్రవేశానికి నోటిఫికేషన్



తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2023 – 24 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేసింది

కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.

👉అప్లికేషన్ ప్రారంభ తేదీ 

 09-02-2023

👉అప్లికేషన్ చివరి తేదీ :

06-03-2023

👉ప్రవేశ పరీక్ష తేదీ :

23-04-2023

👉సమయం :

ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

 👉  అప్లై చేసుకునే విధానం:-

మీ దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.   

అప్లికేషన్ వెబ్సైట్ 

    www.tswreis.ac.in

  www.tgcet.cgg.gov.in

www.tgtwgurukulam.telangana.gov.in

www.mjptbcwreis.telangana.gov.in

దరఖాస్తు రుసుము:-

100 రూపాయలు


అభ్యర్థులు  తేదీ : 09-02-2023 నుండి 06-03-2023 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును 

ఎంపిక విధానం:-

విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది

కావల్సిన అర్హతలు:-

 2022- 2023 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

OC మరియు BC పిల్లలు 01-09-2012 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).

SC మరియు ST పిల్లలు, SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు 01-09-2010 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).

సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాల్లోని వారికి 2,00,000/- లోపు ఉండాలి.

అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-

స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH 

 మొబైల్ నెంబర్

 విద్యార్థి ఆధార్ నెంబర్

కులం (వివరాలు)

 ఆదాయం ( వివరాలు).

 చదువుతున్న స్కూల్స్ అడ్రెస్

 విద్యార్థి ఫోటో

 విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు

PIN CODE NO 

ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.

పరీక్షా విధానం:-

పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది.

పరీక్షా విధానం ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఉంటాయి.( 4 సమాధానాల నుండి 1 సమాధానాన్ని ఎంపిక చేసుకోవాలి).

మొత్తం  మార్కులు-100 గా ఉంటాయి.

తెలుగు- 20 మార్కులు

ఇంగ్లీష్- 25 మార్కులు

గణితం- 25 మార్కులు

EVS- 20  మార్కులు

మెంటల్ ఎబిలిటీ- 10 మార్కులు

పరీక్షా సిలబస్:-

విద్యార్థులు తాము చదివిన ౩ మరియు 4 తరగతుల్లోని తెలుగు, ఇంగ్లీష్, గణితం, EVSల నుండే ప్రశ్నలు వస్తాయి. అదనంగా మెంటల్ ఎబిలిటీ నుండి 10 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.

ఫీజు చెల్లించుటకుCLICK HERE
అప్లై చేయుటకుCLICK