TELANGANA GURUKUL CET-2023

 

 TELANGANA GURUKUL CET-2023

తెలంగాణ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లోప్రవేశానికి నోటిఫికేషన్



తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2023 – 24 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేసింది

కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.

👉అప్లికేషన్ ప్రారంభ తేదీ 

 09-02-2023

👉అప్లికేషన్ చివరి తేదీ :

06-03-2023

👉ప్రవేశ పరీక్ష తేదీ :

23-04-2023

👉సమయం :

ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

 👉  అప్లై చేసుకునే విధానం:-

మీ దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.   

అప్లికేషన్ వెబ్సైట్ 

    www.tswreis.ac.in

  www.tgcet.cgg.gov.in

www.tgtwgurukulam.telangana.gov.in

www.mjptbcwreis.telangana.gov.in

దరఖాస్తు రుసుము:-

100 రూపాయలు


అభ్యర్థులు  తేదీ : 09-02-2023 నుండి 06-03-2023 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును 

ఎంపిక విధానం:-

విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది

కావల్సిన అర్హతలు:-

 2022- 2023 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

OC మరియు BC పిల్లలు 01-09-2012 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).

SC మరియు ST పిల్లలు, SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు 01-09-2010 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).

సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాల్లోని వారికి 2,00,000/- లోపు ఉండాలి.

అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-

స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH 

 మొబైల్ నెంబర్

 విద్యార్థి ఆధార్ నెంబర్

కులం (వివరాలు)

 ఆదాయం ( వివరాలు).

 చదువుతున్న స్కూల్స్ అడ్రెస్

 విద్యార్థి ఫోటో

 విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు

PIN CODE NO 

ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.

పరీక్షా విధానం:-

పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది.

పరీక్షా విధానం ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఉంటాయి.( 4 సమాధానాల నుండి 1 సమాధానాన్ని ఎంపిక చేసుకోవాలి).

మొత్తం  మార్కులు-100 గా ఉంటాయి.

తెలుగు- 20 మార్కులు

ఇంగ్లీష్- 25 మార్కులు

గణితం- 25 మార్కులు

EVS- 20  మార్కులు

మెంటల్ ఎబిలిటీ- 10 మార్కులు

పరీక్షా సిలబస్:-

విద్యార్థులు తాము చదివిన ౩ మరియు 4 తరగతుల్లోని తెలుగు, ఇంగ్లీష్, గణితం, EVSల నుండే ప్రశ్నలు వస్తాయి. అదనంగా మెంటల్ ఎబిలిటీ నుండి 10 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.

ఫీజు చెల్లించుటకుCLICK HERE
అప్లై చేయుటకుCLICK

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020 Download annual grade increment software for multiple employees from below as ...