Employees Welfare Fund

ఉద్యోగుల ఆర్థికావసరాలకు సంక్షేమ నిధి (Employees Welfare Fund)



👉 ప్రభుత్వ కొలువుల్లో సేవలందిస్తున్న వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులకు ఆర్ధిక అవసరాల నిమిత్తం సహాయం, రుణాలు అందించేందుకు 1980 లో  రాష్ట్ర ప్రభుత్వం *ఉద్యోగుల సంక్షేమ నిధి (EWF)* ఏర్పాటుచేసింది. ఈ నిధికి అవసరమైన సొమ్మును సభ్యుల చందా, ప్రభుత్వ గ్రాంట్, ప్రజా విరాళాల రూపంలో సమకూర్చుతారు. ఈ మొత్తం నిధికి లభించే వడ్డీ  నుంచి ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్ధిక సహకారం/కొద్ది మొత్తంలో రుణాలు అందిస్తారు.


👉 *ప్రభుత్వ ఉద్యోగులే సభ్యులు:*

ప్రభుత్వ/స్థానిక/ఎయిడెడ్ సంస్థల్లో నియమితులైన ఉద్యోగులు ఈ పథకంలో సభ్యులు. అత్యవసర ఉద్యోగులు మినహా తాత్కాలిక, రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులందరూ తప్పనిసరిగా సభ్యులుగా ఉంటారు.


👉 *సభ్యత్వం ఇలా:*

మొదట ఉద్యోగి వార్షిక చందా రూ.5 గా ఉండేది. 1992 తర్వాత రూ.10 గా ఉండేది. 2006 మార్చి నుండి వార్షిక చందా మొత్తం రూ.20 కి పెరిగింది. అయితే ఉద్యోగి సభ్యత్వం తీసుకునేప్పుడు రూ.50 చెల్లించాలి. తర్వాత నుంచి వార్షిక చందా 20 చెల్లించాలి. ఈ ప్రారంభ చెందా,వార్షిక చెందా మొత్తం రూ.70 ఉద్యోగి మొదటి నెల జీతం నుండి మినహాయిస్తారు. వార్షిక చందా రూ.20  ప్రతి సంవత్సరం ఉద్యోగి మార్చి జీతం నుండి మినహాయిస్తారు.


👉 *సంక్షేమ నిధి నిర్వాహణ కమిటీ:*

ఈ నిధిని నిర్వహించేందుకు రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రెటరీ ఛైర్మెన్ గా, ఆర్ధికశాఖ జాయింట్ సెక్రెటరీ మెంబర్ కార్యదర్శి-కం-ట్రెజరర్ గా ఒక కమిటీ ఉంటుంది. అలాగే జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా,జిల్లా ట్రెజరీ అధికారి మెంబర్ కార్యదర్శి-కం-ట్రెజరర్గా ఉంటుంది. అంతేకాకుండా  ఆయా కమిటీల్లో  ప్రభుత్వ గుర్తింపు గల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల రాష్ట్ర,జిల్లాస్థాయి కమిటీల బాధ్యులు సభ్యులుగా ఉంటారు.


👉 *అప్పులు మంజూరు ఇలా... G.O.Ms.No.131,EWF Dt: 14.5.2012*

ఉద్యోగులు/వారి పిల్లల వివాహాలకు, పిల్లలకు చదువులు/వైద్య ఖర్చులు నిమిత్తం సభ్యులకు ఈ ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి అప్పులు మంజూరు చేస్తారు. జిల్లా కమిటీ ద్వారా రూ.20 వేల వరకు అప్పును పొందవచ్చు. సాధారణ వడ్డీతో కలిపి తీసుకున్న రుణాన్ని 5 సంవత్సరాలలో చెల్లించాలి. వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు, పిల్లల విదేశీ చదువులకు రూ.25 వేల వరకు ఈ నిధి నుంచి అప్పు మంజూరు చేస్తారు.


👉 ఈ అప్పులను DD ల రూపంలో చెల్లిస్తారు. నిర్ణయించబడిన సమాన వాయిదాలలో ప్రతి నెలా జీతపు బిల్లులో రికవరీ చేయాలి. *G.O.Ms.No.404,F&P Dt: 30.7.2001*


👉 *ఆర్ధిక సహాయం ఇలా...*

వైద్య ఖర్చులు/పిల్లల చదువులు/ఆచార సంబంధమైన కార్యాలకు రూ.1000 వరకు ఉచిత సహాయం అందిస్తారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి రూ.10,000 లకు మించకుండా ఈ నిధి నుంచి రుణం మంజూరు చేస్తారు. రెగ్యులర్ ఉద్యోగులకు రియంబర్స్మెంట్/ఉపాధ్యాయ ఆరోగ్య పథకంలో అర్హత ఉంటుంది. శస్త్ర చికిత్స అనంతరం రియంబర్స్మెంట్ కంటే ఎక్కువ ఖర్చు అయితే ఆ ఉద్యోగికి 10,000 మించకుండా అప్పు మంజూరు చేస్తారు. గృహనిర్మాణం/కొనుగోలు/మరమ్మత్తుల నిమిత్తం ఈ నిధి నుంచి అప్పు గాని,సహాయం గాని లభించదు.


 *దరఖాస్తు ఇలా...*

ఈ నిధి నుంచి రుణం కోసం/ ఆర్ధిక సహాయానికి దరఖాస్తులు నిర్ణీత ఫారం లో రాష్ట్ర కమిటీ మెంబర్,సెక్రటరీ కం ట్రెజరర్ ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి కి సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు పంపించాలి. దరఖాస్తు ఫారాలు జిల్లా ఖజానా కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...