How to correct mistake in PAN CARD your self ? ?

How to correct mistake in PAN CARD your self ?
మీ PAN Card లోతప్పులుంటే ఆన్లైన్లో మీరే సరిచేసుకోవడం ఎలా ?



 మీ PAN Card లో తప్పులున్నాయా? అయితే, మీ PAN Card వివరాలను ఆన్లైన్లో మీరే సరిచేసుకోవచ్చు.  మీ ఇంటి చిరునామా లేదా మీ పేరును లేదా ఇంకా వేరేవైనా వివరాలను మీరే మీ PAN Card ను ఆన్లైన్లో చాలా సులభముగా అప్డేట్ చెయ్యవచ్చు. NSDL (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేయవచ్చు.


ఆన్లైన్లో PAN కార్డు వివరాలను ఎలా అప్డేట్ చేయాలి ?

1. NSDL e-Gov-గవర్నెన్స్ పాన్ కార్డుకు ఏవైనా మార్పులను అభ్యర్థించడానికి ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. Onlineservices.nsdl.com లోకి వెళ్ళండి

2. 'అప్లికేషన్ టైప్' నుండి వచ్చిన ఎంపికలలో  'Changes Or Corrections Existing Pan Data' ఎంపికను ఎంచుకోండి

3. దరఖాస్తుదారుడు ఇక్కడ అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

4. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కొత్త పేజీకి మళ్ళించబడతారు. ఇక్కడ ఒక టోకెన్ సంఖ్య సృష్టించబడుతుంది.

5. ఈ టోకెన్ నంబర్, దరఖాస్తులో అందించిన ఇమెయిల్ ID కి కూడా పంపబడుతుంది

6. ఇప్పుడు, 'e-సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్'  అందించి సబ్మిట్ చేయండి

7. ఇప్పుడు, ఇక్కడ మీ పాన్ సంఖ్యను సూచిస్తుంది

8. మీరు మార్చుకోవాలనుకుంటున్న వాటిని సరైన వాటిని ఎంచుకొని, వాటి  యొక్క ఎడమ అంచుపై సంబంధిత బాక్స్ ఎంచుకోండి.

9. దరఖాస్తుదారు వారి నివాసం లేదా కార్యాలయ చిరునామా లేదా పేరు అని సూచించాలి

10. దరఖాస్తుదారు ఏ చిరునామాను పునరుద్ధరించాలనే ఉధ్యేశించారో, వారు అదే వివరాలను ఫారమునకు జోడించిన అదనపు పేజీలో పూర్తి చేయాలి.

11. దరఖాస్తుదారునికి కమ్యూనికేషన్ చిరునామా లేదా పేరు యొక్క ప్రూఫ్ తప్పనిసరి.

12. ఫారం నింపిన తర్వాత రసీదు సృష్టించ బడుతుంది

13. ఈ రసీదును ప్రింట్ చేసి, మిగిలి పత్రాలను జతచేసి కింది చిరునామాలకు పంపించండి: 


Income Tax  PAN  Service Unit - (Managed by NSDL e -Governance Infrastructure Limited)

5th Floor, Mantri Sterling, Plat No. 341,

Survey No. 997/8, Model Colony,

Deep Bungalow  Chowk , Pune - 411 016.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...